గత 23 రోజులుగా నందమూరి తారకరత్న మృత్యువుతో పోరాడుతోన్న సంగతి తెలిసిందే. అయితే.. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. విదేశీ వైద్యుల బృందం తారకరత్నను కోమాలో నుంచి బయటకి తేవడానికి శతవిధాలా ప్రయత్నించిందని, అయితే వైద్యానికి తారకరత్న సహకరించడం లేదని తెలుస్తోంది.
గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నందమూరి కుటుంబసభ్యులందరూ హుటాహుటిన బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు. ప్రస్తుతం విదేశీ వైద్యులు బృందం తారకరత్నకు చికిత్స అందిస్తోంది. అయినప్పటికీ.. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదని నారాయణ హృదయాలయ వైద్యులు చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. వైద్యానికి తారకరత్న సహకరించడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా.. తారకరత్న నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినట్లు సమాచారం.
విదేశీ వైద్యుల బృందం తారకరత్నను కోమాలో నుంచి బయటకి తేవడానికి శతవిధాలా ప్రయత్నించారని సమాచారం. అయితే.. తారకరత్న శరీరం వైద్యానికి సహకరించడం లేదని తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం ఆస్పత్రి వైద్యులు తారకరత్నకు మరోసారి బ్రెయిన్ స్కాన్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ రిపోర్టులో ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదని సమాచారం. అందులోనూ.. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళన కరంగా మారినట్లు తెలుస్తోంది. దీంతో నందమూరి బాలకృష్ణ, ఇతర నందమూరి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు ఒక్కక్కరిగా బెంగుళూరు చేరుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీ ముఖ్య నేత కొల్లు రవీంద్ర అక్కడికి చేరుకున్నారు.
బెంగుళూరు లోని నారాయణ హృదయలయ హాస్పిటల్ చేరుకున్న నందమూరి బాలకృష్ణ#TarakaratnaHealthUpdate #TarakaRatna #TarakRatna#Getwellsoontarakratna#NandamuriBalakrishna pic.twitter.com/olbOKGZmyM
— 𝚃𝙴𝙰𝙼_𝙲𝙱𝙽 #𝒀𝒖𝒗𝒂𝑮𝒂𝒍𝒂𝒎 ✌️ (@TEAM_CBN1) February 18, 2023
నారాయణ హృదయాలయ ఆస్పత్రికి చేరుకున్న కొల్లు రవీంద్ర నేరుగా ఐసీయూలోకి వెళ్లి తారకరత్నను పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా తెలియజేశారు. “గత కొన్ని రోజులుగా బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న గారిని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లును అడిగి తెలుసుకుని ఆ సమయంలో అక్కడకి చేరుకున్న నందమూరి బాలకృష్ణ గారితో కాసేపు చర్చించడం జరిగింది..’ అని కొల్లు రవీంద్ర తన ఫేస్‌బుక్ ఖాతాలో రాసుకొచ్చారు. మరికొందరు టీడీపీ ముఖ్య నేతలు సైతం బెంగుళూరు చేరుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో హృదయాలయ పరిసరప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
Andhra ex minister @KolluROfficial seen at Narayana hrudayalaya to see #tarakaratna who is very critical#TarakaratnaHealthUpdate pic.twitter.com/PkxQQZSZu3
— @vikas.k.inventor (@vikasinventor) February 18, 2023
Reports says actor #tarakaratna is likely to be shifted to #Hyderabad tonight. #Hebbagodi police arrived at #NarayanaHrudalaya. pic.twitter.com/p4NFr1BdjL
— dinesh akula (@dineshakula) February 18, 2023