మరింత క్షీణించిన తారకరత్న ఆరోగ్య పరిస్థితి. ఒక్కొక్కరిగా బెంగుళూరు చేరుకుంటున్న టీడీపీ ముఖ్యనేతలు. ఇప్పటికే.. కొల్లు రవీంద్ర, గంటా శ్రేనివాస్ రావు అక్కడకి చేరుకున్నారు. మరికొందరు ముఖ్యనేతలు సైతం అక్కడకి చేరుకుంటున్నట్లు సమాచారం అందుతోంది.
గత 23 రోజులుగా నందమూరి తారకరత్న మృత్యువుతో పోరాడుతోన్న సంగతి తెలిసిందే. అయితే.. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. విదేశీ వైద్యుల బృందం తారకరత్నను కోమాలో నుంచి బయటకి తేవడానికి శతవిధాలా ప్రయత్నించిందని, అయితే వైద్యానికి తారకరత్న సహకరించడం లేదని తెలుస్తోంది.