Taraka Ratna Died & Cause of Death News: గత 23 రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్సపొందుతూ నటుడు నందమూరి తారకరత్న కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బాధాకరమైన విషయాన్నీ నందమూరి కుటుంబ సభ్యులు ప్రకటించారు.
మరింత క్షీణించిన తారకరత్న ఆరోగ్య పరిస్థితి. ఒక్కొక్కరిగా బెంగుళూరు చేరుకుంటున్న టీడీపీ ముఖ్యనేతలు. ఇప్పటికే.. కొల్లు రవీంద్ర, గంటా శ్రేనివాస్ రావు అక్కడకి చేరుకున్నారు. మరికొందరు ముఖ్యనేతలు సైతం అక్కడకి చేరుకుంటున్నట్లు సమాచారం అందుతోంది.
గత 23 రోజులుగా నందమూరి తారకరత్న మృత్యువుతో పోరాడుతోన్న సంగతి తెలిసిందే. అయితే.. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. విదేశీ వైద్యుల బృందం తారకరత్నను కోమాలో నుంచి బయటకి తేవడానికి శతవిధాలా ప్రయత్నించిందని, అయితే వైద్యానికి తారకరత్న సహకరించడం లేదని తెలుస్తోంది.
అందుతున్న సమాచారం ప్రకారం.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే బాలకృష్ణ, నందమూరి కుటుంబసభ్యులందరూ హుటాహుటిన బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు. మరి కాసేపట్లో తారకరత్న హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆస్పత్రి వైద్యులు ఇప్పటికే తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్నదానిపై కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్న విషయం తెలిసిందే. తారకరత్న కోసం నిష్ణాతులైన వైద్యులు పని చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్యాన్ని సమీక్షిస్తున్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో తారకరత్న ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. తారకరత్న మెదడుకి స్కానింగ్ చేసిన వైద్యులు.. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించనున్నారు. అయితే పరిస్థితులు అనుకూలించకపోతే మెరుగైన […]
ప్రస్తుతం తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిపుణులైన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. హాస్పిటల్ లో అడ్మిట్ అయిన మొదటిరోజుతో పోలిస్తే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నా.. కుటుంబ సభ్యులకు భయం అనేది సహజం. అందుకే హిందూపురం నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తీసుకొచ్చినా.. అక్కడ కూడా పని అయ్యేలా లేదని.. విదేశాలకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ వెల్లడించారు. తారకరత్నను మెరుగైన వైద్యం […]
నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. టీడీపీ యువనేత నారా లోకేష్ కుప్పంలో ప్రారంభించిన యువగళం పాదయాత్ర జరుగుతున్న సమయంలో తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో.. మెరుగైన వైద్యం కోసం తారకరత్నని కుప్పం నుండి బెంగళూరుకు తరలించారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్న ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆయన్ని కాపాడేందుకు వైద్యులు అహర్నిశలు ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో తారకరత్న ఆరోగ్య పరిస్థితిని […]
నందమూరి తారకరత్న ఆరోగ్యపరిస్థితిపై హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ముందుగా అక్కడికి చేరుకున్న బాలకృష్ణ, ఈరోజు అక్కడికి చేరుకున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తారకరత్న ఆరోగ్యం గురించి వైద్యులను సంప్రదించి మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. “యువగళం యాత్రలో మాసీవ్ హార్ట్ అటాక్ తో తారకరత్న కుప్పకూలాడు. హార్ట్ బీట్ కాసేపు ఆగిపోయినప్పటికీ.. ఆ తర్వాత మిరాకిల్ జరిగి మళ్లీ హార్ట్ బీట్ మొదలైంది. బెటర్ ఐసీయూ కేర్ కోసం నారాయణ […]