సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ లో సినిమాలు పడితే బాగుంటుందని అనిపిస్తుంది. స్టార్ హీరోలైనా, దర్శకులైనా ఏదొక టైంలో వీరి కాంబో సెట్ అయితే సినిమా మామూలుగా ఉండదనే అభిప్రాయాలు కలుగుతుంటాయి. టాలీవుడ్ లో అలాంటి కాంబినేషన్స్ చాలానే ఉన్నాయి. అల్లు అర్జున్ – సుకుమార్, కొరటాల శివ – మహేష్ బాబు, ప్రభాస్ – రాజమౌళి, బాలకృష్ణ – బోయపాటి, ఎన్టీఆర్ – వినాయక్ ఇలా కొన్ని కాంబినేషన్స్ లో సినిమాలంటేనే అభిమానులు పండగ చేసుకుంటారు. అయితే.. వీరు మాత్రమే కాకుండా కొన్నిసార్లు వేరే వాళ్ళతో సినిమాలు చేసినా రిజల్ట్ బ్లాక్ బస్టర్ అయితే మాత్రం మరో సినిమా ఎప్పుడా అని చూస్తుంటారు.
గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో పదేళ్లు దాటినా ఇంకా సినిమా రాలేదు. కానీ.. ఫ్యాన్స్ లో అంచనాలు మాత్రం అలానే ఉన్నాయి. మరోవైపు హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా కేవలం స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్న దర్శకుడు ఒకరున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ని కలిసిన ఆ డైరెక్టర్.. పవన్ తో కాకుండా ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో సినిమాలు తెరకెక్కించాడు. కానీ.. ఎప్పుడు చూసినా పవన్ తో కలిసి ఉన్న ఫోటోలలో కనిపిస్తూనే ఉంటాడు. దాదాపు పవన్ తో ఆ డైరెక్టర్ దిగిన పిక్ 1987లోది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో అదే డైరెక్టర్ పవన్ కళ్యాణ్ సినిమా ఖచ్చితంగా చేస్తానని చెప్పేశాడు. ప్రస్తుతం ఆ డైరెక్టర్ కి, పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.
అలాగే వారిద్దరూ కలిసి రీసెంట్ గా దిగిన సెల్ఫీ కూడా ట్రెండ్ అవుతుండటం విశేషం. ఇంతకకీ ఎవరా డైరెక్టర్ అని అనుకుంటున్నారా? ఒకప్పుడు మహేష్ బాబు సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఆ డైరెక్టర్.. మహేష్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ సినిమానే కన్నడలో రీమేక్ చేసి, ఇక్కడ ప్లాప్ అయిన ఆంధ్రావాలా మూవీనే కన్నడలో తీసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఇప్పటికే ఆ డైరెక్టర్ ఎవరో అర్థమై ఉంటుంది. అతనే మెహర్ రమేష్. ఎన్టీఆర్ తో కంత్రి, శక్తి.. ప్రభాస్ తో బిల్లా.. వెంకటేష్ తో షాడో సినిమాలు చేసిన మెహర్ రమేష్.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ చేస్తున్నాడు. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూ పవన్ తో సినిమా చేస్తానని చాలా నమ్మకంగా చెప్పాడు. ఈ క్రమంలో మెహర్ రమేష్, పవన్ కలిసి గతంలో దిగిన ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతుండటం మరో విశేషం.
— Chikkipoina Chiranjeevi (@NithinPSPKCult) October 24, 2022