ఇండస్ట్రీలో సినిమాలు ఎప్పుడు రిలీజైనా.. వాటికి సంబంధించి కొత్త విషయాలు తెలిస్తే ఎంతో సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. అవునా.. ఫలానా సినిమా విషయంలో ఇలా జరిగిందా.. అలా జరిగిందా? అని రెగ్యులర్ గా ఆరా తీసేవారు కూడా ఉంటారు.
ఇండస్ట్రీలో సినిమాలు ఎప్పుడు రిలీజైనా.. వాటికి సంబంధించి కొత్త విషయాలు తెలిస్తే ఎంతో సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. అవునా.. ఫలానా సినిమా విషయంలో ఇలా జరిగిందా.. అలా జరిగిందా? అని రెగ్యులర్ గా ఆరా తీసేవారు కూడా ఉంటారు. అయితే.. ఇండియాలో పాన్ ఇండియా సత్తా ప్రూవ్ చేసిన మొదటి సినిమా ఏదంటే.. బాహుబలి సిరీస్ అనే చెప్పాలి. అప్పటిదాకా టాలీవుడ్ అగ్రదర్శకుడిగా ఫామ్ లో ఉన్న రాజమౌళి.. బాహుబలితో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. గతేడాది ఆర్ఆర్ఆర్ తో వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలిచేసరికి రాజమౌళి పేరు అన్ని దేశాలకు విస్తరించేసింది. అయితే.. రాజమౌళి ఎన్ని అద్భుతాలు సృష్టించినా.. బాహుబలి తర్వాతే అవుతుందని చెప్పాలి. ముఖ్యంగా బాహుబలి 2.. ఇండియన్ సినిమాని ప్రపంచదేశాలకు విస్తరించడమే కాకుండా.. కలెక్షన్స్ లో ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసింది.
ఈ క్రమంలో సినిమా వచ్చి 6 ఏళ్ళు అవుతున్నా.. ఇంకా ఎక్కడో చోట బాహుబలి పేరు వినిపిస్తూనే ఉంటుంది. బాహుబలి ప్రస్తావన లేకుండా పాన్ ఇండియా సినిమాల ఉనికి గురించి మాట్లాడలేరు. అయితే.. దర్శకుడు రాజమౌళి భార్య, కొడుకుతో పాటు ఫాదర్, కజిన్స్ ఇలా అందరూ ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులంతా సినిమాలలో వర్క్ చేస్తారనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా రమా రాజమౌళి, ఎంఎం కీరవాణి, విజయేంద్రప్రసాద్ మొదటి నుండి రాజమౌళితో ట్రావెల్ అవుతున్నారు. ఆ తర్వాత రాజమౌళి జర్నీలో కార్తికేయ.. కూతురు మయూఖ యాడ్ అయ్యారు. అయితే.. రాజమౌళి కూతురు మయూఖ కూడా సినిమాలలో నటించిందని ఎవరికైనా తెలుసా?
ఆమె ఏయే సినిమాలలో నటించిందో ఎప్పుడైనా గమనించారా?.. లేదు కదా! రాజమౌళి కూతురు మయూఖ కూడా సినిమాలలో మెరిసింది. అదికూడా తండ్రి సినిమాలలోనే. అవును.. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’లో మయూఖ నటించింది. బాహుబలి 2లోని సాహోరే బాహుబలి సాంగ్ లో రావణకాష్టం తర్వాత ప్రభాస్ పై అందరూ పూలవర్షం కురిపిస్తారు. ఆ పిల్లలలో మయూఖని మీరు గమనించవచ్చు. ఇక అంతకుముందే మయూఖ రాజమౌళి రూపొందించిన ‘విక్రమార్కుడు’ మూవీలో మెరిసింది. అప్పుడింకా చిన్న పాప. ఆ సినిమాలోని ‘కాలేజ్ పాపల బస్సు’ సాంగ్ లో ఫ్రూటీ తాగి ఆ ప్యాకెట్ విసిరేసే పాప మయూఖనే.
ఈ విషయం ఎప్పుడూ ఎవరూ గమనించి ఉండరు. కానీ.. ఇది నిజం. అయితే.. రాజమౌళి, రమా దంపతులకు మయూఖ దత్తపుత్రిక అని తెలుస్తోంది. ఛత్రపతి సినిమా షూటింగ్ టైంలో రాజమౌళి.. చిన్న పాపగా ఉన్న మయూఖని దత్తత తీసుకున్నారని సమాచారం. ఇదిలా ఉండగా.. గ్లోబల్ రికగ్నిషన్ పొందిన రాజమౌళి.. ఇంట్లో తన తల్లి తర్వాత కూతురుకే ఎక్కువ భయపడతారట. ఆయనకు కూతురంటే అంత ప్రేమ. మయూఖ ఏది అడిగినా కాదనకుండా అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారట రాజమౌళి దంపతులు. కాగా.. రాజమౌళి తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించనున్నాడు. ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఆ సినిమా పట్టాలెక్కనుంది. మరి రాజమౌళి కూతురు మయూఖ సినిమాలలో కనిపించిందని మీకు తెలుసా తెలీదా? కామెంట్స్ లో తెలపండి.