డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఏ విషయమైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. అది ఎలాంటి విషయమైనా.. కొంతమంది అది పబ్లిక్ లో మాట్లాడొద్దేమో అని ఆగిపోయే విషయాలు కూడా జనాలకు ఎలా చెప్పాలో అలా చెబుతుంటారు. పూరి బిహేవియర్ కూడా తన సినిమాలలో హీరోల మాదిరే ఓపెన్ గా ఉంటారు. అందుకే ఆయన మాటలు ఎక్కువగా వివాదాలకు దారి తీస్తుంటాయి. సరే వివాదాలు వస్తున్నాయని తన అభిప్రాయాన్ని చెప్పడం ఆపేస్తాడా? అబ్బే.. అది అసలు జరగదు. కెమెరా ముందు చెప్పకపోతే ఏం.. తనకు ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది.. తన మాటలకి ఎంతోమంది ఫ్యాన్స్, సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.
తాజాగా పూరి తన మ్యూసింగ్స్ లో భాగంగా యువతకి ఓ కొత్త పాఠం చెప్పుకొచ్చాడు. పూరి మాట్లాడుతూ.. “ప్రతి రోజూ మనలో కలిగే ఎమోషన్స్ కి మెయిన్ రీజన్ మన శరీరంలోని కెమికల్స్. డోపమైన్ ఆక్సాటిస్ లాంటి కెమికల్స్ వల్ల మనలో నవ్వు, ఆనందం, లవ్వు, టియర్స్ లాంటి ఎన్నెన్నో ఫీలింగ్స్ వస్తుంటాయి. కానీ, వయసులో ఉన్న అబ్బాయిలు మాత్రం వాళ్ళ ప్రేమ నిజం అనుకుంటారు.. ఆ అమ్మాయి దేవత అని.. వాళ్ల ప్రేమను పెద్దవాళ్లు అర్థం చేసుకోట్లేదని అనుకుంటారు. అదంతా ట్రాష్. డాక్టర్ హెలెన్ ఫిషర్ అనే ఒకావిడ వయసులో ఉన్న యూత్ పై, వాళ్ల ప్రేమలపై రీసెర్చ్ చేసింది.
కొంతమంది అబ్బాయిల బ్రెయిన్స్.. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కంటే అందగత్తె ఫొటో చూపిస్తే ఇంకా బెటర్ గా రియాక్ట్ అవుతుంటాయి. కొందరు వెధవలకి ఏ అమ్మాయి ఫోటో చూపించినా బ్రెయిన్ ఒకేలా రియాక్ట్ అవుతుంది. పరీక్షలు అన్నీ అయ్యాక ఆమెకు అర్థమైంది ఏంటంటే.. ప్రేమా లేదు దోమా లేదు.. ఇవన్నీ శరీరంలోని కెమికల్స్ మాయ అని. లవ్ కూడా ఓ డ్రగ్ అని చెప్పింది. అబ్బాయి,అమ్మాయి ముద్దు పెట్టుకున్నప్పుడు డోపమైన్ విడుదలై ముద్దు చాలా బావుంటుంది. అందుకే ఇంకో ముద్దు కావాలనిపిస్తుంది. అలా అది ముద్దుతో ఆగదు. కానీ.. వాళ్లేమో తనను ఎంత ముద్దాడిన తనివి తీరడం లేదని తెగ మురిసిపోతుంటారు. లవ్ అనే డ్రగ్‌లో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు.
ప్రేమలో ఉన్నప్పుడు ప్రామిస్ చేయొద్దు. లవర్ కోసం అమ్మనాన్నని, ఆస్తులను వదిలేసి పారిపోవాలని అనిపించవచ్చు. అందుకే ప్రామిస్ కి ముందు కనీసం రెండు సార్లు అయినా స్వయం తృప్తిని పొందండి. దాంతో కనీసం శరీరంలోని కెమికల్స్ అయినా చల్లబడతాయి. కామ్ అవుతారు. కామ్ గా ఉన్నప్పుడు బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అప్పుడే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. లేకపోతే కెమికల్స్ అన్ని ఒప్పేసుకో, పెళ్లి చేసుకో, ఆర్య సమాజం.. అంటూ మీతో తప్పు చేయిస్తాయి. అందుకే అబ్బాయి, అమ్మాయి రెండు సార్లు స్వయం తృప్తిని పొందాకే ఏవైనా మాట్లాడుకోండి. పాతికేళ్లు వయసు దాటాకే ఎంతో కొంత బుద్ధి, జ్ఞానం వస్తుంది. ఆ లోపు యూత్‌కి బుర్ర అస్సలు పని చేయదు. అలా లవ్ మాయలో పడి లైఫ్ నాశనం చేసుకోవద్దు” అని చెప్పుకొచ్చాడు పూరి. మరి పూరి చెప్పిన యూత్ పాఠంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.