సెలబ్రిటీలు స్టేజ్ పై ప్రశంసించుకున్నా.. ప్రపోజ్ చేసుకున్నా ఆ పరిణామాలు ఎలా ఉంటాయో తెలిసిందే. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా కాలంలో చిన్న క్లూ దొరికితేనే సెలబ్రిటీలను అల్లడిస్తుంటారు ట్రోలర్స్, నెటిజన్స్. అలాంటిది స్టేజ్ పై పబ్లిక్ గా హీరోయిన్ కి ‘ఐ లవ్ యూ’ చెబితే ఊరుకుంటారా..? రీసెంట్ గా వీరసింహారెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేని, హీరోయిన్ శృతిహాసన్ విషయంలో అలాంటిదే జరిగింది. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్ పై గోపీచంద్ మాట్లాడుతూ.. శృతిహాసన్ కి ‘ఐ లవ్ యూ’ చెప్పాడు. పైగా ఆ లవ్ అనేది చెల్లిగానా, హీరోయిన్ గానా అనేది క్లారిటీ ఇవ్వలేదు. అంటే.. హీరోయిన్ క్లారిటీ ఇచ్చింది అనుకోండి.
ఆ తర్వాత స్టేజ్ పైకి వచ్చిన హీరోయిన్ శృతిహాసన్.. లవ్ యూ చెప్పిన గోపీచంద్ ని అన్నయ్య అని పిలిచింది. అంతే.. ఇక ట్రోలర్స్ కి స్టఫ్ దొరికేసింది. చిన్న హిట్ ఇస్తే చెలరేగిపోతాం.. అంటూ శృతిని, గోపిని పెట్టి ఊరమాస్ ట్రోల్స్, మీమ్స్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియాలో బ్రదర్ సిస్టర్ లవ్ లాగా కాకుండా.. ఒకబ్బాయి లవ్ ని అమ్మాయి రిజెక్ట్ చేసినట్లుగా చూపిస్తూ ఆటాడుకున్నారు. ఆ మీమ్స్ కూడా ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. దాని తర్వాత వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ అయ్యింది.. థియేటర్స్ ని కలెక్షన్స్ తో షేక్ చేసేస్తోంది. ఈ క్రమంలో సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ డైరెక్టర్ గోపీచంద్ తాజాగా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
ఈ నేపథ్యంలో వీరసింహారెడ్డి సినిమా విశేషాలు మాట్లాడిన తర్వాత.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శృతిహాసన్ కి లవ్ యూ చెప్పిన విషయాన్నీ ప్రస్తావించారు యాంకర్. దీనిపై గోపీచంద్ స్పందిస్తూ.. ‘శృతితో నేను మూడు సినిమాలు చేశాను. బలుపు, క్రాక్ తర్వాత వీరసింహారెడ్డి. ఆమెతో నాకు బ్రదర్ – సిస్టర్ లాంటి బాండింగ్ ఉంది. అదే లవ్ ని నేను స్టేజ్ పై చెప్పాను. దాన్ని సోషల్ మీడియాలో అబ్బాయి – అమ్మాయి లవ్ గా మార్చి వైరల్ చేశారు. అవన్నీ చూసి బాగా నవ్వుకున్నాను. శృతితో మా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది.’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గోపీచంద్ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి శృతి, గోపీచంద్ ల లవ్ బాండింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.