సాధారణంగా ఒక సెలబ్రిటీ మాట్లాడిన డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ అయితే.. ఆ డైలాగులను వేరే సెలబ్రిటీలు ట్రోల్ చేస్తుంటారు. కానీ ఇక్కడ దిల్ రాజు తనను తానే ట్రోల్ చేసుకున్నారు.
సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉండడంతో సెలబ్రిటీలు ఏం మాట్లాడినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. సెలబ్రిటీల నోటి నుంచి జాలువారిన పదాలు గానీ, డైలాగులు గానీ బాగా ట్రోలింగ్ కి గురవుతున్నాయి. కొన్ని పాజిటివ్ గా ట్రోల్ అయితే, కొన్ని నెగిటివ్ గా ట్రోల్ అవుతుంటాయి. మొత్తానికి ట్రోల్స్ వల్ల జనాలు అయితే హ్యాపీగా ఉంటున్నారు. అయితే జనాలు మాత్రమే కాదు.. ఈ ట్రోలింగ్స్ చూసి సెలబ్రిటీలు కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. తమ మీద వచ్చే ట్రోల్స్ ని పాజిటివ్ గా తీసుకుంటున్నారు. ఆ మధ్య రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమా గురించి వచ్చిన మీమ్స్, ట్రోల్స్ పై ముగ్గురూ తెగ ఎంజాయ్ చేశారు. ఇలా తమ మీద వచ్చే ట్రోల్స్, మీమ్స్ ని ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఏదైనా ఈవెంట్ లో స్టేజ్ మీద గుర్తు చేసుకోవడం లాంటివి చేస్తుంటారు. తాము మాట్లాడిన డైలాగులు ఇంత ప్రాచుర్యం పొందాయా అని గుర్తు చేసుకుని మరోసారి మాట్లాడతారు.
ఆ మధ్య హీరో కార్తీ.. ‘ఎవర్రా మీరంతా’ డైలాగ్ గురించి ప్రస్తావిస్తూ ఈ డైలాగ్ ఇంత ఫేమస్ అవుతుందనుకోలేదని అన్నారు. ఇలా తెలుగులో చాలా డైలాగులు ఉన్నాయి. అలా ఫేమస్ అయిన వాటిలో ఇరుక్కు అనే దిల్ రాజు మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ట్రోల్స్, మీమ్స్ వేసే వాళ్లకి స్టఫ్ అయ్యాయి. వారిసు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న దిల్ రాజు.. ఆ సమయంలో విజయ్ గురించి, సినిమా గురించి ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు. సినిమా లెవిల్ వెడల్పు చేసే పనిలో భాగంగా.. ఈ సినిమాలో కామెడీ ఇరుక్కు, ఫైట్స్ ఇరుక్కు, స్టోరీ ఇరుక్కు, విజయ్ మేనరిజమ్ ఇరుక్కు అంటూ తమిళంలో మాట్లాడారు. అవి కాస్తా బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
దిల్ రాజు మాట్లాడిన మాటలను మీమర్స్, ట్రోలర్స్ తెగ వాడుకున్నారు. యూట్యూబ్ లో, ఫేస్ బుక్ లో ఎక్కడ చూసినా ఇరుక్కు డైలాగే. తన మీద ట్రోల్స్, మీమ్స్ వచ్చిన విషయం దిల్ రాజు వరకూ వెళ్లినట్టుంది. అందుకే తనను తానే ట్రోల్ చేసుకున్నారు. తన మాటల మీద తానే సెటైర్ వేసుకున్నారు. మామూలుగా వేరే సెలబ్రిటీలు మాట్లాడిన మాటలు ట్రోల్ అయితే వాటిని వేరే హీరోలు మాట్లాడి సరదాగా ట్రోల్ చేస్తారు. కానీ ఈ విషయంలో దిల్ రాజు తనను తానే ట్రోల్ చేసుకున్నారు. కమెడియన్ వేణు తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న సినిమా బలగం. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించగా.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.
మార్చి 3న విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్ రాజ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ఫైట్స్ ఇల్లే (లేవు), ఈ సినిమాలో డ్యాన్స్ లేదు, విజయ్ బాడీ లాంగ్వేజ్ లేదు. కానీ ఈ సినిమాలో సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇరుక్కు, సూపర్ ఎమోషన్స్ ఇరుక్కు,. సూపర్ తెలంగాణ నేటివిటీ ఇరుక్కు అని అందరినీ నవ్వించారు. బలగం సినిమా మన గుండెకాయ లాంటి సినిమా అని అన్నారు. ఏది ఏమైనా ట్రోల్స్ ని స్పోర్టివ్ గా తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. వేరే ఎవరైనా అయితే ట్రోల్ చేస్తే సీరియస్ గా తీసుకుంటారు. కానీ దిల్ రాజు చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. మరి తనను తానే ట్రోల్ చేసుకున్న దిల్ రాజుపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.