టాలీవుడ్ యువహీరో నిఖిల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కార్తికేయ 2’. మిస్టరీ థ్రిల్లర్ జానర్ లో చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా.. ఇటీవలే థియేటర్లలో విడుదలై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. కృష్ణతత్వానికి, సైన్స్ ని.. అడ్వెంచర్స్ ని ముడిపెట్టి రూపొందిన ఈ సినిమాను నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ లు సంయుక్తంగా నిర్మించారు. ఇక మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లిన కార్తికేయ 2.. విడుదలైన మూడో రోజే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసి రూ. 2 కోట్ల ప్రాఫిట్ సాధించింది.
ఈ క్రమంలో సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడంతో కార్తికేయ 2 టీమ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ కి ప్రముఖ నిర్మాత దిల్ రాజు గెస్ట్ గా హాజరయ్యారు. అలాగే కార్తికేయ 2 సినిమా విడుదలకు ముందు తనపై వచ్చిన ఆరోపణలు, రూమర్స్ పై స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. కార్తికేయ 2 బిగ్ హిట్ అయినందుకు చిత్రయూనిట్ ని అభినందించిన దిల్ రాజు.. అనంతరం మాట్లాడుతూ.. “నేనొక విషయంపై క్లారిటీ ఇవ్వాలి. లేదంటే ఎప్పటికి నాకు ఒక ఫీలింగ్ ఉండిపోతుంది.
ఈ సినిమా రిలీజ్ ముందు నుండే నిఖిల్ కి, నాకు మధ్య డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. జూలై 8న థాంక్యూ మూవీ రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కానీ.. సినిమా రెడీ కాలేదు. అందుకు నేను జులై 22న రిలీజ్ చేద్దామని అనుకున్నాం. అప్పటికే ఈ సినిమా అనౌన్స్ చేశారని తెలిసి ప్రొడ్యూసర్స్ తో మాట్లాడుకుంటాం. తర్వాత ఒకరోజు నిఖిల్, డైరెక్టర్ చందూ మా ఇంటికొచ్చారు. అంత హెల్తీగా ఉంటుంది మా మధ్య వాతావరణం. కానీ.. ఈ హెల్తీనెస్ ని తీసుకెళ్లి బయట గ్యాప్స్ క్రియేట్ చేస్తున్నారు. సక్సెస్ మీట్ లో ఇలా మాట్లాడటం బాధగా ఉంది.
ఇప్పుడు నేను మాట్లాడకపోతే ఇండస్ట్రీలో మాకేదో యూనిటీ లేదనుకుంటారు. ప్రొడ్యూసర్స్ అంతా ఒక్కటై మేం రిలీజ్ గురించి, క్లాషెస్ గురించి మాట్లాడుకుంటాం. నిఖిల్, చందూ వచ్చి పర్వాలేదు థాంక్యూ రిలీజ్ చేసుకోండి. మేం వేరే డేట్ చూసుకుంటాం అన్నారు. అప్పుడు నేను వాళ్ళ సినిమాకి ఏ అవసరమైన హెల్ప్ చేస్తానని చెప్పాను. 5వ డేట్ అనుకున్నారు అప్పటికే బింబిసార, సీతారామం ఉన్నాయి. తర్వాత 12వ డేట్ అనుకున్నారు.. కానీ అప్పటికే రెండు మూడు సినిమాలు అనౌన్స్ అయ్యాయి. సడన్ గా కోబ్రా సినిమా వాయిదా పడింది.
ఇక సినిమా 12కి రాబోతుంది. ఈ లోపలే ఎవ్వడికి తోచింది వాడు.. సినిమాలను తొక్కేస్తున్నారని రాస్తున్నాడు. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరూ సినిమాలను తొక్కుకోరు. అది రాసేవాళ్లకు, చదివే వాళ్లకు, వినేవాళ్లకు ఉండాల్సిన మినిమమ్ కామన్ సెన్స్. మాకిక్కడ సినిమా ఆడితే మేం ఆనందపడతాం. మీ క్లిక్స్ కోసం, మీ సబ్ స్క్రైబర్స్ కోసం మాలో మాకే ఏదో క్రియేట్ చేస్తూ.. మమ్మల్ని బలి పశువులను చెయ్యొద్దు. ఇంతకుముందు కూడా నామీద ఇలాంటివి చాలా వచ్చాయి. ఓపిక పడుతూ వచ్చాను.
ఎవడైనా సినిమాను తొక్కుతాడా? కామన్ సెన్స్ తో బిహేవ్ చేయాలి. వాస్తవాలు తెలియకపోతే తెలుసుకోండి. నేను తప్పుచేస్తే మీడియా ముందు క్షమించమని అడుగుతాను. సినిమా కోసం నేను ప్రాణమిస్తాను. సినిమాలనెప్పుడు పాడు చేయాలనీ చూడను. దయచేసి వాస్తవాలు తెలుసుకొని రాయండి. తెలియకుంటే మూసుకోండి” అంటూ ఫైర్ అయ్యాడు. అలాగే చివరికి ఎమోషనల్ అయ్యాడు దిల్ రాజు. ప్రస్తుతం దిల్ రాజు మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి దిల్ రాజు మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.