ఫిల్మ్ డెస్క్- తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్క తమిళ్ లోనే కాదు తెలుగులోను విజయ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. విజయ్ తమిళ్ లో నించిన చాలా సినిమాలు తెలుగులో మంచి విజయం సాధించాయి. అందుకే విజయ్ కి తెలుగులోను అభిమానులున్నారు. విజయ్ కు తెలుగులో ఉన్న క్రేజ్ మేరకు ఆయనతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు అగ్ర నిర్మాత దిల్ రాజు. ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి చెప్పిన కధ దిల్ రాజుకు బాగా నచ్చిందట. ఈ కధకు తమిళ హీరో విజయ్ అయితే బాగా సూట్ అవుతాడని వంశీ సూచించాడని తెలుస్తోంది. దీంతో నెల రోజు క్రితమే దిల్ రాజు చెన్నై వెళ్లి హీరో విజయ్ ని సంప్రదించారని సమాచారం. కధ నచ్చడంతో ఈ ప్రాజెక్టుకు విజయ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను దిల్‌రాజు తెలుగు, తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అందుకు తగినట్లే అందరికీ కనెక్ట్ అయ్యే యూనిక్ పాయింట్‌తో సినిమాను రూపొందించడానికి కథను సిద్ధం చేయిస్తున్నారు. ఈ భారీ సినిమాకు దిల్‌రాజు సుమారు 170 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకున్నారట. ఐతే ఈ సినిమాకు విజయ్ అడిగిన రెమ్యునరేషనే హాట్ టాపిక్ గా మారింది. మొత్తం ఐదు బాషల్లో రూపొందించాలనుకుంటున్న ఈ సినిమాకు హీరో విజయ్ 90 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేశారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం విజయ్ తన సినిమాలకు 70 నుంచి 80 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. అందుకే ఈ భారీ ప్రాజెక్టుకు 90 కోట్ల రూపాయల పారితోషికం అడిగారని తమిళ సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇక దిల్ రాజు సైతం విజయ్ అడిగిన 90 కోట్ల రెమ్యునరేషన్ కు ఓకే చెప్పారని సమాచారం. కరోనా పరిస్థితులు సద్దుమణగ్గానే ఈ భారీ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.