సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవడం కారణంగా సెలబ్రిటీల గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. వాటిలో ఏది నిజమో, అబద్ధమో నమ్మడం చాలా కష్టం. ముఖ్యంగా స్టార్ల పర్సనల్ లైఫ్ గురించి వచ్చే న్యూస్ అయితే కన్ఫ్యూజ్ చేసేస్తుంటాయి.
సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవడం కారణంగా సెలబ్రిటీల గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. వాటిలో ఏది నిజమో, అబద్ధమో నమ్మడం చాలా కష్టం. ముఖ్యంగా స్టార్ల పర్సనల్ లైఫ్ గురించి వచ్చే న్యూస్ అయితే కన్ఫ్యూజ్ చేసేస్తుంటాయి. ఇటీవల కాలంలో బాలీవుడ్ మొదలు ఇతర ఇండస్ట్రీల్లోనూ విడాకుల వ్యవహారం వైరల్ అవుతుంది. అలాగే వీరు విడిపోతున్నారంటూ కొంతమంది స్టార్ కపుల్ పేర్ల మీద ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్, తన భార్య సపరేట్ కాబోతున్నారంటూ తెగ ప్రచారం చేశారు. ‘విజయ్ ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడలేదు. పైగా ఇటీవల ఆయన పాల్గొంటున్న కార్యక్రమాలకు కూడా భార్య హాజరు కాలేదు. ఒకవేళ నిజమేనేమో’ అంటూ కామెంట్స్ చేశారు. కట్ చేస్తే, విజయ్ వైఫ్ ఆ రూమర్లకు చెక్ పెట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. తమిళ్ యంగ్ హీరో శివ కార్తికేయన్, అదితి శంకర్ జంటగా మడోన్ అశ్విన్ తెరకెక్కించిన ‘మావీరన్’ (మహావీరుడు) జూలై 14న తమిళనాట భారీగా విడుదలైంది. ఫస్ట్ డే మార్నింగ్ షో చూడ్డానికి విజయ్ భార్య సంగీత చెన్నైలోని ఓ థియేటర్‌కు వచ్చారు. ముఖానికి ముసుగేసుకుని హాల్లోకి వచ్చిన సంగీత, శివ కార్తికేయన్ భార్య ఆర్తి చేయి పట్టుకుని ఆమెతో సంతోషంగా మాట్లాడారు. ప్రేక్షకాభిమానుల సందడి నడుమ సినిమా చూశారు. స్టార్ హీరో భార్య సామాన్య ప్రేక్షకురాలిలా థియేటర్‌కి రావడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.
మరీ ముఖ్యంగా ఆమె ఇలా బయట కనిపించడంతో దళపతి ఫ్యాన్స్ తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు. ‘గతకొద్ది రోజులుగా వినిపిస్తున్న పుకార్లకు సంగీత చెక్ పెట్టారు. త్వరలో జరుగబోయే ‘లియో’ ఫంక్షన్‌కి ఆమె వస్తారు’ అంటూ సోషల్ మీడియాలో సంగీత థియేటర్‌కు వచ్చిన వీడియోను వైరల్ చేస్తున్నారు. కాగా ‘మావీరన్’ తమిళంతో పాటు తెలుగులోనూ పాజిటివ్ టాక్ దక్కించుకుంది. కోలీవుడ్‌లో ఫస్ట్ డే రూ.7.61 కోట్ల ఓపెనింగ్స్ సాధించింది.