ఏదైనా సమస్య మనకి వస్తే.. కష్టం. మన వాళ్ళకి వస్తే నరకం. ఢీ డ్యాన్స్ షో ద్వారా పాపులర్ అయిన యశ్ మాస్టర్ పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది. ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ, తాను నవ్వుతూ, అందరిని నవ్వించే యశ్ మాస్టర్ సడెన్ గా ఏడుస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. అందులో ఆయన బాధని చూసి ప్రేక్షకులు సైతం తీవ్ర దుఃఖానికి గురి అవుతున్నారు. ఇంతకీ యశ్ కి వచ్చిన కష్టం ఏమిటి?
ఢీ షో ద్వారా యశ్ మాస్టర్ కి చాలా పేరే వచ్చింది. అయితే.., అదంతా ఆయన ఒక్కడి కష్టమే కాదు. ఇందులో తన టీమ్ పాత్ర చాలా ఉందని స్వయంగా యశ్ మాస్టర్ చాలా సార్లు చెప్పుకొచ్చారు. ఇక ఆయన టీమ్ లో మెయిన్ మెంబర్ అంటే అందరికీ ముందుగా గుర్తుకి వచ్చే పేరు కేవల్ దే. ఇలా యశ్ మాస్టర్ తన టీమ్ ని ఓ కుటుంబంగా భావిస్తూ ఉంటాడు. అయితే.., యశ్ మాస్టర్ మనసుకి ఎంతో దగ్గరైన కేవల్ ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ కి గురి కావడంతో ఢీ ఫ్యామిలీ అంతా తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.
తన అసిస్టెంట్ బ్లడ్ క్యాన్సర్ అని తెలియడంతో యశ్ మాస్టర్ బాధని దిగమింగుకుంటూ ఓ వీడియోని రిలీజ్ చేశాడు.”ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా అసిస్టెంట్ కేవల్ మీ అందరికీ తెలుసు. అతను ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఇప్పుడు అతడికి వేలూరులోని సీఎంసీ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే ఇప్పుడు అర్జెంట్ పన్నెండు మంది బ్లడ్ ఇవ్వాల్సి ఉంది. దాని కోసం ఇక్కడి నుంచి మేం బయల్దేరుతున్నాం. కానీ.., తిరుపతి, చెన్నై, బెంగూళరు ఇలా అక్కడ దగ్గర్లో ఉన్న వారు ఎవరైనా సాయం చేయండి. వెళ్లి రక్తాన్ని ఇవ్వండి. మీకు మిగతా సమాచారాన్ని చెబుతాను. ఇక్కడ ఫోన్ నంబర్ కూడా ఇస్తాను. ప్లీజ్ అతని కోసం ప్రార్థించండి” అని యశ్ మాస్టర్ తీవ్ర వేదనకి గురి అవుతూ ఈ వీడియోలో మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. కేవల్ ఈ సమస్య నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.