డ్యాన్స్ షో అంటే ఒకప్పుడు డ్యాన్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మాత్రం కామెడీలో డ్యాన్స్ తక్కువైంది! అలా అని ఇది అన్ని డ్యాన్స్ షోలకు వర్తించదు. గత కొన్ని సీజన్ల నుంచి తీసుకుంటే.. ‘ఢీ’ షోలో డ్యాన్స్ తో పాటు కామెడీ స్కిట్స్ కూడా చేస్తూ వస్తున్నారు. అయితే కొన్నిసార్లు డ్యాన్స్ ఫెర్ఫామెన్స్ విషయంలో రొమాంటిక్ స్టెప్పులు, డ్యాన్సర్స్ మధ్య కెమిస్ట్రీ ఎక్కువవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా సేమ్ అలానే జరిగింది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో కొన్ని స్టెప్పులు విషయంలో డ్యాన్సర్స్ అనుకున్న దానికంటే ఎక్కువ కెమిస్ట్రీ వర్కౌట్ చేశారా అనే డౌట్ వచ్చింది. చూడటానికి కాస్త విచిత్రంగానూ అనిపించింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఢీ షోలో డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ లు అద్భుతంగా చేస్తుంటారు. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కొన్నిసార్లు మాత్రం డ్యాన్స్ ఫెర్ఫార్మెన్సుల్లో శ్రుతిమించి చేస్తున్నారా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే డ్యాన్సర్స్ వేసే కొన్ని స్టెప్పులు చూడటానికి ఇబ్బంది అనిపించేలా, అదే టైంలో నవ్వు తెప్పించే రీతిలో ఉంటాయి. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ సుదర్శన్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ‘దీవాని దీపాన్ని’ పాటని డ్యాన్సర్స్ స్టేజీపై ఫెర్ఫార్మ్ చేశారు. కానీ అందులో ఓ చోట.. మేల్ డ్యాన్సర్ పై ఫిమేల్ డ్యాన్సర్ పడుకున్నట్లు ఓ స్టెప్ వేశారు.
మరో స్టెప్పుల్లో మేల్ డ్యాన్సర్స్ పై ఏకంగా ఇద్దరు అమ్మాయిలు కూర్చున్నట్లు పోజిచ్చారు. ఈ రెండు సీన్లు డ్యాన్సులో భాగమై ఉండొచ్చు కానీ టీవీ ప్రోగ్రామ్స్ అంటే పెద్దోళ్లు మాత్రమే కాదు పిల్లలు కూడా చూస్తుంటారు. రొమాంటిక్ సాంగ్ లు అయినా సరే కొంతవరకు ఓకే గానీ మరి ఇలా మితిమీరిపోతే ఎలా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ‘ఢీ 15’ కోసం శేఖర్ మాస్టర్ చాన్నాళ్ల తరవాత రీఎంట్రీ ఇచ్చారు. గత వారం షోలో కనిపించిన ఆయన ఇప్పుడు కనిపించలేదు. ఆ ప్లేసులో గణేష్ మాస్టర్ దర్శనమిచ్చారు. సరే ఇదంతా పక్కనబెడితే.. ‘ఢీ’ తాజా ప్రోమో మీకెలా అనిపించింది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.