ఇప్పటికే తెలుగు, తమిళ హిందీ భాషలతో పాటు హాలీవుడ్లో కూడా బిజీగా ఉన్న ధనుష్ వరుస సినిమాలు ఒప్పుకోవడం ఆసక్తి రేపుతోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన జగమే తంత్రం సినిమా కొద్ది రోజుల క్రితం ఆన్ లైన్ వేదికగా సుమారు 17 భాషల్లో 190 దేశాలలో రిలీజ్ అయింది. ధనుష్ క్రేజ్ తో సినిమాకి మంచి వ్యూస్ దక్కుతున్నా ఈసారి తెరకెక్కించబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఫిక్సయ్యారు ధనుష్. కొద్ది రోజుల క్రితం ఆయన శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఒక ట్రై లింగ్యువల్ మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. ఇక ధనుష్ నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడంతో ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు ధనుష్ మరో తెలుగు సినిమా ఒప్పుకున్నట్లే అని ప్రచారం జరుగుతోంది.ఈ ప్రాజెక్టు గనుక ఓకే అయితే దీని తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీని ప్లాను అంతా తెలుగులో లవ్ స్టోరీస్ తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్న ఒక కుర్ర దర్శకుడు అని భోగట్టా. ధనుష్ కి తమిళ్ లో ఉన్న మార్కెట్ తో పాటు దర్శకుడికి, ప్రొడక్షన్ హౌస్ కి తెలుగులో ఉన్న మార్కెట్ తోడైతేకచ్చితంగా ఇది ఒక మంచి వెంచర్ అవుతుందని ప్రొడక్షన్ సంస్థ భావిస్తున్నట్లు సమాచారం.