Deepika Pilli: టిక్ టాక్ భామ దీపికా పిల్లి గురించి తెలుగు యువతకు, బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. టిక్ టాక్ వీడియోల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వయ్యారి.. బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. వచ్చీ రాగానే తెలుగులో గ్లామరస్ యాంకర్లలో ఒకరిగా క్రేజ్ దక్కించుకుంది. ఎందుకంటే.. సోషల్ మీడియా వీడియోలలోనే కాదు.. స్టేజిపై కూడా తన అందాలను ఊహించని రేంజిలో ఆరబోస్తుంది.
దీపికా అందాలకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. మొదట `ఢీ` షోలో అడుగుపెట్టిన దీపికా.. యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్, హైపర్ ఆదిలతో మంచి కామెడీ పండించి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఢీ నుండి బయటికి వచ్చాక.. మెగాబ్రదర్ నాగబాబు `కామెడీస్టార్స్`లో సోలో యాంకర్ గా రాణిస్తుంది. అయితే.. ఈ షోలో పొట్టి దుస్తులు ధరించి దీపికా చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
ప్రతి ఆదివారం ప్రసారమయ్యే `కామెడీ స్టార్స్` కోసం ట్రెండీ వేర్ లో ముస్తాబై దీపికా పిల్లి.. ఫ్యాన్స్, నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక తాజాగా నాగబాబు జడ్జిగా వ్యవహరిస్తున్న ‘పార్టీ చేద్దాం పుష్ప పార్ట్ 2’ ప్రోమో విడుదలైంది. ఈ వీడియోలో దీపికా పిల్లి ఇదివరకూ ఎన్నడూ చూడని రేంజిలో హాట్ డ్యాన్సులతో రెచ్చిపోయింది. గోల్డ్ కలర్ డ్రెస్ లో దీపికా అందాలన్నీ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి.
దీపికా పిల్లి అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయ్యింది. ప్రస్తుతం కామెడీ స్టార్స్ ధమాకా యాంకర్ గా కొనసాగుతున్న దీపికా.. ఎప్పటికప్పుడు తన గ్లామర్ షోతో ఆద్యంతం ప్రేక్షకుల అటెన్షన్ సొంతం చేసుకుంటోంది. ఇక తాజా వీడియోలో దీపికా పిల్లి హాట్ డ్యాన్స్ పై మరో గ్లామరస్ యాంకర్ అనసూయ.. ‘దీపికా పిల్లి అనుకుంటివా పులి’ అంటూ చేసిన కామెంట్స్ హైలైట్ అవుతున్నాయి. మరి ప్రస్తుతం దీపికా పిల్లి డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. మరి దీపికా డ్యాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.