వివాదాలను, అనసూయను విడదీసి చూడలేము. బుల్లితెర యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ.. కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉంది అనసూయ. అయితే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే.. సోషల్ మీడియాను మాత్రం వదలదు.
వివాదాలను, అనసూయను విడదీసి చూడలేము. బుల్లితెర యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ.. కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉంది అనసూయ. అయితే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే.. సోషల్ మీడియాను మాత్రం వదలదు. నిత్యం ఏదో పోస్టింగ్ చేస్తూ.. ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. ఇక అనసూయకు, విజయ్ దేవరకొండ అభిమానులకు ట్విట్టర్ వేదికగా సాగే వార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అర్జున్ రెడ్డి సినిమా విడుదల సమయంలో వీరి మధ్య వివాదం ప్రారంభం అయ్యింది. అది కాస్త.. అలా పెరుగుతూనే వస్తోంది. అయితే తాజాగా తన బాధనంత కన్నీళ్ల రూపంలో వ్యక్తపరుస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తివివారల్లోకి వెళ్తే..
అనసూయ తన ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ లో హాలో అందరికీ.. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నీ పోస్ట్ చూసి మీరందరూ ఎంతో బాధపడి ఉంటారు. ఇకపోతే నాకు తెలిసినంత వరకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అనేవి సమచారాన్ని పంచుకునేందుకే ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి మన జీవిత విషయాలను పంచుకోవడానికి , సంతోషాలను, బాధలను షేర్ చేసుకునేందుకు సోషల్ మీడియా ఉంది. ఇప్పుడు ఈ పోస్ట్ ఎందుకు వేశానంటే.. నేను ఏ ఫోటోషూట్ చేసినా, సరదాగా ఫోటోలు తీసుకున్నా, డ్యాన్స్ చేసిన, ఏం చేసిన మీతో షేర్ చేసుకున్నాను. ఎందుకుంటే అవన్నీ నా జీవితంలో భాగమే.. అలాగే నా జీవితంలో బాధకరమైన క్షణాలు కూడా ఉన్నాయి.
అప్పుడు నేను చాల ఎడ్చాను, ఎంతో కుమిలిపోయాను. ఇవన్నీ మీతో షేర్ చేకసుకోవాలనుకున్నాను. నీ జీవితంలో ఇలాంటీ రోజులు కూడా ఉన్నాయని మీకు తెలియాలని ఈ వీడియో పెట్టాను అంటూ.. చెప్పుకొచ్చింది. అందరనీ నేను కోరుకునేది ఇక్కటే.. దయచేసి మంచి మనసుతో ఉండండి. అవతలివాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకొండి. ఏది పడితే అది మాట్లాడి వారికి ఇంకా బాధకలిగించవద్దు. ఈ వీడియో 5 రోజుల క్రితానిది. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. అంటూ.. రాసుకొచ్చింది. అయితే తన ఫ్యాన్స్ మాత్రం సపోర్ట్‌గా నిలుస్తున్నారు. మీరు బాధపడకండి మెడమ్, మీరు హ్యాపీగా ఉండండి అంటూ అనుసుయా ఫ్యాన్స్ ఓదార్చే ప్రయత్నం చేస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు.