డేవిడ్ వార్నర్ – ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్ అయిన వార్నర్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటాడు. అతను బ్యాట్ పట్టి మైదానంలో అడుగుపెడితే బౌండరీలు చిన్నబోతాయి. సోషల్ మీడియాలో లైకుల లెక్కలు మిలియన్లు దాటేస్తాయి. ఆసీస్ క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్‌గానైనా, సన్‌రైజర్స్ కెప్టెన్‌గానైనా పరుగుల వరద పారాల్సిందే. తెలుగు పాటలకు డ్యాన్స్‌లు వేస్తూ, డైలాగులు చెప్తూ ఇటీవల వార్నర్ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” చిత్రం నుంచి తాజాగా ఒక పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేశారు. తారక్ బైక్ నడుపుతుండగా రామ్ చరణ్ వెనక కూర్చున్నాడు. ఈ ఫోటో షేర్ చేసిన కొంత సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది మెగా, నందమూరి అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఫోటో చూసిన క్రికెట్ దిగ్గజం ఆసీస్ క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న డేవిడ్ వార్నర్ కూడా తనదైన శైలిలో స్పందించారు. “ఆర్ఆర్ఆర్” చిత్ర బృందం విడుదల చేసిన ఈ ఫోటోను తనదైన శైలిలో మార్ఫింగ్ చేసి మరోసారి అభిమానులను సందడి చేశారు.
వార్నర్ ఈ ఫోటోలో తారక్ తలకి బదులుగా తన సహచరుడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ తలను జోడించాడు. అదేవిధంగా రామ్ చరణ్ తలకు బదులుగా తన తలను అమర్చాడు.ఈ విధంగా మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో క్షణాలలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కామెంట్లతో ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఫొటోపై ఎస్ఆర్హెచ్ సహచరుడైన రషీద్ ఖాన్ వెంటనే స్పందించాడు. ‘హెల్మెట్ గైస్’ అంటూ ట్రోల్ చేశాడు. వెంటనే స్పందించిన వార్నర్ ‘నువ్వు కూడా రషీద్ భాయ్’ అని కామెంట్ చేశాడు.