స్పోర్ట్స్ డెస్క్- ఐపీఎల్ 2021 సీజన్ ఆసక్తికరంగా సాగింది. ఈ సీజన్ లో డేవిడ్ వార్నర్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి తప్పించడం సంచలనంగా మారింది. ఐపీఎల్ 2021 సీజన్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన హైదరాబాద్, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచి టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ క్రమంలో ముందు కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించిన హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్, ఆ తర్వాత తుది జట్టులో కూడా స్థానం ఇవ్వలేదు. […]
డేవిడ్ వార్నర్ – ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్ అయిన వార్నర్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటాడు. అతను బ్యాట్ పట్టి మైదానంలో అడుగుపెడితే బౌండరీలు చిన్నబోతాయి. సోషల్ మీడియాలో లైకుల లెక్కలు మిలియన్లు దాటేస్తాయి. ఆసీస్ క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్‌గానైనా, సన్‌రైజర్స్ కెప్టెన్‌గానైనా పరుగుల వరద పారాల్సిందే. తెలుగు పాటలకు డ్యాన్స్‌లు వేస్తూ, డైలాగులు చెప్తూ ఇటీవల వార్నర్ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” చిత్రం […]
కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే టిక్‌టాక్‌లో అడుగుపెట్టిన ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్ రోజుకో వీడియోతో అభిమానులను అలరిస్తున్నాడు. ఖాళీ సమయం దొరికిందంటే చాలు సామాజిక మాధ్యమాల్లో బిజీ అయిపోతుంటాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. తన పిల్లలు, సతీమణి కాండీస్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఫుల్ […]
క్రికెట్ లో ధనా ధన్ లీగ్ అంటే అందరికీ ముందుగా గుర్తుకి వచ్చేది ఐపీఎల్ మాత్రమే. కానీ.., ఐపీఎల్ 2021 సీజన్ అర్ధాంతరంగా వాయిదా పడింది. జట్లలో కొంత మంది ఆటగాళ్లకు కొవిడ్ పాజిటివ్ రావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.., ఐపీఎల్ వాయిదా తరువాత విదేశీ ఆటగాళ్లను వారి వారి దేశాలకి చేర్చే బాధ్యత కూడా బీసీసీఐ తీసుకుంది. ఇప్పటికే అన్ని దేశాల క్రికెటర్స్ తమ స్వస్థాలను చేరుకున్నారు. కానీ.., ఆస్ట్రేలియా ఆటగాళ్లతో మాత్రం […]