తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అతి కొద్దిమంది లేడీ కమెడియన్స్ లో జబర్దస్త్ రోహిణి ఒకరు. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన రోహిణి.. తనశైలి కామెడీ పంచులు, మాటలతో ప్రత్యేక గుర్తింపు సంపాందించుకుంది. ఓ వైపు జబర్దస్త్ షో చేస్తూనే మరోవైపు ఇతర టీవీ ప్రోగ్రామ్స్ లో అదరగొడతుంది. ఆమెను కొందరు జూనియర్ కోవై సరళ అని కూడ పిలుస్తుంటారు. రోహిణి.. ఎక్కడుంటే అక్కడ తన కామెడీతో నవ్విస్తుందని, ఎప్పుడెప్పుడు జబర్దస్త్ లో ఆమె స్కిట్స్ చూద్దామా అని వెయిట్ చేస్తుంటారు ప్రేక్షకులు. అయితే ఎప్పుడు చక్కగా, హోమ్లీగా కనిపించి అందరిని ఆకట్టుకునే రోహిణి… ఓ షోలో మాస్ డ్యాన్స్ చేసింది.
తెలుగు బుల్లితెరపై అనేక కామెడీ షోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్. కామెడీ స్టార్స్ , శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి మొదలైన షోలు ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి. వివిధ రకాల పేర్లతో పలు స్పెషల్ షోల్ చేస్తూ ..బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు మేకర్స్. తాజాగా “అంటే సుందరానికి” అనే ఓ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఒకటి విడుదలైంది. ఈ ప్రోమో ఓ రేంజ్ లో ఉంది. సుధీర్, ముక్కు అవినాష్, అరియానా, సత్యశ్రీ.. ఇలా అందరు అదిరిపోయే కామెడీ చేశారు. ఎప్పుడు తనపై పంచులు వేయించుకుంటు అందరిని నవ్వించే రోహిణి కూడా ఈ కార్యక్రమంలో ఆకట్టుకుంది. ఎప్పుడు హోమ్లీగా కనిపించి అందరిన ఆకట్టుకునే రోహిణి రూట్ మార్చింది.
మాస్ డ్యాన్స్ చేస్తూ దుమ్ములేపింది. “రాజా..రాజా.. మన్మద రాజా” అనే పాటకు రోహిణి అదిరిపోయే స్టెపులేసింది. ఈ కార్యక్రమానికి చెందిన ప్రోమో తాజాగా విడుదలైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిణిలో ఇంత హాట్ డ్యాన్సర్ కూడా ఉందా? అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రోమోపై మీరు ఓ లుక్కేసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Rashmika Mandanna: వీడియోలు: హాట్ లుక్‌లో హీట్ పెంచుతున్న నేషనల్ క్రష్ రష్మిక!
ఇదీ చదవండి: Alia Bhatt: మిడిల్ ఫింగర్ చూపించిన అలియా భట్.. రణవీర్ అదిరే కౌంటర్!
ఇదీ చదవండి: Krithi Shetty: నాగచైతన్యతో ఉంటే ఆ ఫీలే వేరు.. కృతి శెట్టి!