Alia Bhatt: స్టార్ హీరోయిన్ అలియా భట్ గురించి సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఇదివరకు అలియా బాలీవుడ్ వరకే పరిమితం అయినప్పటికీ, ట్రిపుల్ ఆర్ సినిమాతో సౌత్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత తాను ప్రేమించిన స్టార్ హీరో రణబీర్ కపూర్ ని పెళ్లాడింది. రెండు నెలలు తిరగకుండానే గర్భవతి అయ్యానని ప్రకటించి అటు ఇండస్ట్రీని, ఇటు ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసింది. ఇటీవలే ఓ హాలీవుడ్ సినిమా షూటింగ్ సైతం పూర్తిచేసి.. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్ కరణ్' షోలో పాల్గొంది. అయితే.. ఈ టాక్ షోలో అలియా భట్ తో పాటు స్టార్ హీరో రన్వీర్ సింగ్ పాల్గొన్నాడు. ఇక షోలో కరణ్ జోహార్ అడిగే ప్రశ్నలకు టకటకా సమాధానాలు చెబుతూ ఇద్దరూ సందడి చేశారు. కానీ.. షోలో రన్వీర్ ని ఉద్దేశించి అలియా చేసిన ఓ పని మాత్రం నెట్టింట రచ్చ లేపింది. హోస్ట్ కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు రన్వీర్ తో పోటీపడి మరీ సమాధానం చెప్పే క్రమంలో అలియా.. తన మధ్యవేలును రన్వీర్ కి చూపించింది. అలియా చేసిన పనిని రన్వీర్ లైట్ తీసుకుని నవ్వేశాడు. అయితే.. అలియా వేలు చూపించడాన్ని రన్వీర్ లెక్క చేయకపోవచ్చు. కానీ.. మేం ఊరుకోమని అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఎందుకంటే.. ఆమె చేసిన పనికి రన్వీర్ ఫ్యాన్స్ హర్ట్ అయినట్లు తెలుస్తుంది. దీంతో అలియా చేసిన పని చూడటానికి అస్సలు బాలేదని, స్టార్ హీరో పట్ల అలా ప్రవర్తించడం అసభ్యంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేగాక పెళ్లి తర్వాత అలియా భట్ పూర్తిగా మారిపోయిందని, ఆమె ‘సతీ సావిత్రి పాత్ర' ముగిసిందని చాలా మంది ట్రోల్ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం అలియా, రన్వీర్ ల వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి అలియా భట్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. View this post on Instagram A post shared by @bollymusicals