Rashmika Mandanna: ఇప్పుడు సౌత్ టు నార్త్ రష్మిక మందన్నా. హవా నడుస్తోంది. భాష, ప్రాంతాలతో సంబంధంలేకుండా సినీ ప్రేక్షకులు ఆమెను అభిమానిస్తున్నారు. ఆమె అందానికి సరెండర్ అయిపోయారు. ‘నేషనల్ క్రష్’ అంటూ ఫ్యాన్స్ ఆమెకు పట్టం కూడా కట్టేశారు. ‘నేషనల్ క్రష్’ అన్న పేరుకు తగ్గట్టుగానే.. ఎక్కడ.. ఏ ఈవెంట్లో కనిపించినా.. రష్మిక అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తన గ్రూమింగ్‌తో వ్వావ్ అనిపిస్తున్నారు. గురువారం ఓ ఈవెంట్లో హాట్ లుక్‌లో కనిపించి ఇంటర్నెట్లో హీట్ పెంచేశారు. రెడ్ డ్రెస్‌లో తన దైన స్టైల్లో ఫొటోలకు ఫోజులిచ్చారు. రష్మిక రెడ్ డ్రెస్‌లో ఉన్న ఈవెంట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు వీడియోలపై కామెంట్లు చేస్తూ తమ అభిమానాన్ని తెలియజేస్తున్నారు. కాగా, రష్మిక “పుష్ప” సినిమాతో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. ఆమె హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైమ్ లోనే సౌత్ నుంచి బాలీవుడ్ అన్ని భాషల్లో నటించింది. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఈక్రమంలో బాలీవుడ్ లో మంచి అవకాశాలు సంపాదించింది. View this post on Instagram A post shared by Voompla (@voompla) ప్రస్తుతం రష్మిక మందన్న హిందీలో `మిషన్ మజ్ను`, `గుడ్ బై`తోపాటు రణ్ బీర్ కపూర్‌తో కలిసి `యానిమల్` చిత్రంలో నటిస్తోంది. దీనికి సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. ఇక, తమిళ స్టార్ హీరో విజయ్ బైలింగుల్ సినిమా వారసుడులోనూ రష్మిక హీరోయిన్గా చేస్తోంది. ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మరి, నేషనల్ క్రష్ రష్మిక తాజా హాట్ లుక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by @telugu__actres ఇవి కూడా చదవండి: Rashmika Mandanna: ఆ హీరోతో రూమర్ నిజమే.. హీరోయిన్ రష్మిక క్లారిటీ!