కోబ్రా సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన చియాన్ విక్రమ్ మరో సరికొత్త కథతో రాబోతున్నారు. మద్రాస్, సార్ పట్టా, కబాలి, కాలా వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ ఒక వైవిధ్యమైన చిత్రం చేస్తున్నారు. చియాన్ విక్రమ్ ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. సినిమా, సినిమాకి వైవిధ్యం చూపించాలని తాపత్రయపడతారు. ప్రతీ సినిమా కోసం చాలా కష్టపడతారు. 60 సినిమాల్లో విభిన్న పాత్రలతో అలరించిన విలక్షణ హీరో విక్రమ్ ఇప్పుడు 61వ చిత్రాన్ని మొదలుపెట్టారు. ఈ సినిమాలో విక్రమ్ లుక్ కి సంబంధించిన గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు దర్శకుడు పా రంజిత్. ఈ సినిమాకి తంగలాన్ అనే టైటిల్ ఖరారు చేశారు.
స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కె.ఇ. జ్ఞానవేల్ నిర్మాతగా.. విక్రమ్ హీరోగా యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విక్రమ్ గిరిజన నాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్రలో చియాన్ గెటప్ చాలా సహజంగా ఉంది. ముక్కుకి పోగు పెట్టుకుని, పల్చని తెల్ల గుబురు గడ్డంతో.. పైన ఎలాంటి చొక్కా లేకుండా.. పంచె మోకాలి పైకి ఎత్తి.. చేతిలో కర్రతో అచ్చమైన గిరిజనుడిగా విక్రమ్ కనిపించారు. స్వాతంత్య్రం రాక ముందు గిరిజన తెగలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విక్రమ్ గిరిజన నాయకుడిగా కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి తదితరులు నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
#Chiyaan61 is the journey of #THANGALAAN‘S pursuit of Happiness! @chiyaan @kegvraja @StudioGreen2 @officialneelam @parvatweets @MalavikaM_ @PasupathyMasi @thehari___ @gvprakash @Lovekeegam @kishorkumardop @EditorSelva @anthoruban @moorthy_artdir @aegan_ekambaram @ANITHAera pic.twitter.com/JIZV2xHZGH
— pa.ranjith (@beemji) October 23, 2022