Cobra: తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘కోబ్రా’. ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా యాక్షన్ ప్యాక్‌డ్‌గా తెరకెక్కింది. తాజాగా, ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృంధం విడుదల చేసింది. 2.32 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. యాక్షన్ సీక్వెన్స్‌లు హాలీవుడ్ సినిమాను తలపిస్తున్నాయి. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకుపోయింది. ఇక, ఈ సినిమాలో చియాన్ విక్రమ్ ఓ మ్యాథ్స్ టీచర్‌గా కనిపించనున్నారు. వేషాలు మార్చి విలన్ల పనిపట్టనున్నారు.
కోబ్రా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్లలో జిబీబిజీగా గడుపుతోంది. విక్రమ్ తాజాగా తమిళనాడులో కొంతమంది స్కూలు విద్యార్థుతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్ప సినిమాలోని ప్లవర్ డైలాగ్ చెప్పి వ్వావ్ అనిపించారు. 10 రకాలుగా పుష్ప డైలాగ్ చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు. అంతకు కొన్ని రోజుల ముందు చియాన్ విక్రమ్ ప్రమోషన్ల కోసం తిరుచ్చి వెళ్లారు.
విక్రమ్ వస్తున్నాడని తెలుసుకున్న ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టు దగ్గరకు చేరుకున్నారు. దీంతో వారిని అదుపుచేయటం సీఐఎస్‌ఎఫ్ పోలీసుల వల్ల కాలేదు. ఓ సీఐఎస్‌ఎఫ్ పోలీస్ అభిమానులపై దాడికి దిగాడు. కాలితో తన్నుతూ పరిగెత్తించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఘటనపై విక్రమ్ స్పందించి పోలీస్ తీరును తప్పుబట్టారు. మరి, కోబ్రా ట్రైలర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Anasuya Baradwaj: విజయ్- అనసూయ మధ్య గొడవకి కారణం ఏమిటి? ఎక్కడ చెడింది?