Anasuya Baradwaj: సోషల్ మీడియాలో యాంకర్ అనసూయ వర్సెస్ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌గా గొడవ సాగుతోంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయపై విరుచుకుపడుతున్నారు. బూతులు తిడుతూ రెచ్చిపోతున్నారు. విజయ్ ఫ్యాన్స్ ఇలా అనసూయను టార్గెట్ చేయటానికి కారణం ఓ ట్వీట్. గురువారం ‘లైగర్’ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చిందన్న వార్తలు బయటకు రాగానే అనసూయ ఓ ట్వీట్ పెట్టారు. “అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!!” అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చేసింది విజయ్ దేవరకొండను ఉద్దేశించేనంటూ ప్రచారం జరిగింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ ట్రోల్స్ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే గతంలో అనసూయ, విజయ్ దేవరకొండల మధ్య నడిచిన వివాదం తెరపైకి వచ్చింది. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!!#NotHappyOnsomeonesSadness but #FaithRestored — Anasuya Bharadwaj (@anusuyakhasba) August 25, 2022 2017.. ‘అర్జున్ రెడ్డి’ టైంలో అనసూయ, విజయ్‌ల మధ్య గొడవ నడిచింది. ఆ సినిమాలోని కొన్ని అభ్యంతరకర డైలాగ్‌లను ఆడియో ఫంక్షన్‌లో విజయ్ వాడటాన్ని, ఫ్యాన్స్‌తో వాడించటాన్ని అనసూయ తప్పుబట్టారు. బాహాటంగా వాటిపై విమర్శలు గుప్పించారు. అది మహిళల్ని కించపరిచేలా ఉందని ఆమె అన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ కూడా పెట్టారు. అప్పట్లో ఈ ట్వీట్ పెద్ద దుమారాన్నే రేపింది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయపై విపరీతంగా ట్రోలింగ్స్ చేశారు. అయినా అనసూయ వెనక్కి తగ్గలేదు. ట్విటర్‌లో తన ట్రోలర్స్‌పై ట్వీట్ల యుద్ధం చేశారు. చాలా వేదికల్లో దీనిపై మాట్లాడారు. సెలెబ్రిటీ అయి ఉండి పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌ల మీద మహిళలను కించపరిచే విధంగా విజయ్ డైలాగ్‌లు చెప్పటం పద్దతి కాదని హితవు పలికారు. తాను సినిమాలోని డైలాగుల గురించి మాట్లాడలేదని, ఆడియో ఫంక్షన్‌లాంటి పబ్లిక్ వేదికల్లో ఓ హీరో బూతులు వాడటం, అదీ తల్లిని ఉద్ధేశించిన అభ్యంతరకర పదాలను వాడటం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ గొడవ జరిగి ఐదేళ్లు గడిచింది. తాజాగా, లైగర్ సినిమా విడుదల తర్వాత అనసూయ చేసిన ట్వీట్ మళ్లీ అగ్నికి ఆజ్జం పోసినట్లు అయింది. మరోసారి ట్విటర్ వేదికగా అనసూయ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్ మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. మరి, అనసూయ వర్సెస్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : Vikram Vedha: ‘విక్రమ్ వేద’ బాలీవుడ్ కష్టాలు తీర్చబోతుందా? హిట్ పక్కానా?