‘గాడ్ ఫాదర్’.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా పేరే రీసౌండింగ్ వస్తోంది. బాక్సీఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మెగాస్టార్ రీ ఎంట్రీ ఖైదీ నంబర్ 150 తర్వాత.. మెగా అభిమానులకు మళ్లీ మాస్ ఫీస్ట్ ఇచ్చిన చిత్రం ఇది. లూసిఫర్ రీమేక్‌గా తెలుగులో వచ్చినా కూడా.. మాతృక సినిమా చూసిన వారికి కూడా కొత్తగా అనిపించేలా మోహన్ రాజా తెరకెక్కించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. నా టాప్ 5 చిత్రాల్లో గాడ్ ఫాదర్ కూడా ఉంటుందని మెగాస్టార్ చెప్పడంతోనే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఏ స్థాయిలో ఉందనేది. మెగాస్టార్ స్క్రీన్ మీద లేకపోయినా బ్రహ్మకి ఇచ్చిన ఎలివేషన్స్ కు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. చిరు స్వాగ్, లుక్స్, ఆ మాస్ అప్పియరెన్స్ అందరినీ కట్టిపడేశాయి.
ఇంక గాడ్ ఫాదర్ సినిమా విషయానికి వస్తే బాగా వినిపిస్తున్న పేరు మసూద్ భాయ్(సల్మాన్ ఖాన్). ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ క్యామియో రోల్‌కి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. సల్లూ భాయ్ సినిమాలో కనిపించింది కేవలం 15 నిమిషాలే అయినా.. వచ్చిన రెస్పాన్స్ మాత్రం అందుకు డబుల్ త్రిబుల్ ఉంది. ఈ సినిమాలో నటించాలని అడగ్గానే.. చిరంజీవి, రామ్‌చరణ్‌ల మీద ఉన్న అభిమానం, వారితో ఉన్న రిలేషన్‌ని దృష్టిలో పెట్టుకుని యాక్ట్ చేసేందుకు సల్మాన్ ఖాన్ ఓకే అనేశాడు. గాడ్ ఫాదర్ లో నటించినందుకు సల్మాన్ ఖాన్ అసలు రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు. సినిమా హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సల్మాన్ ఖాన్‌కి ధన్యవాదాలు కూడా తెలిపారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ మరో విధంగా సల్మాన్‌కు తన కృతజ్ఞతను తెలియజేయనున్నారనే టాక్ బాగా వినిపిస్తోంది.