బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న దివి.. సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో మోత మోగిస్తోంది. గ్లామర్ షోతో కుర్రాళ్ళ అటెన్షన్ డ్రా చేస్తూ.. ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటుంది. ఇటు అభిమానుల కళ్ళలోనే కాకుండా అటు సినిమా పెద్దల కళ్ళలో కూడా పడి వరుస ఆఫర్లు చేజిక్కించుకుంటుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు వంటి వాటిలో అవకాశాలు అందిపుచ్చుకుంటూ సాగిపోతుంది. గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవితో కలిసి నటించే అవకాశం కొట్టేసింది అమ్మడు. ప్రస్తుతం జోరు మీద సాగిపోతుంది బుల్లెమ్మ కెరీర్. జీవితంలో ఎన్ని ఉన్నా కొన్ని సరదాలు లేకపోతే వెలితిగా ఉంటుంది. అందుకే కాబోలు దివికి హీరోతో డేట్ కి వెళ్లాలన్న కోరిక పుట్టింది. మన డార్లింగ్ హీరో ప్రభాస్ తో డేట్ కి వెళ్లాలని కోరిక పుట్టిందట.
అయితే ఇప్పుడు కాదు. తాను చదువుకునే రోజుల్లో ప్రభాస్ తో డేట్ కి వెళ్లాలని అనుకుందట. ప్రభాస్ ని పెళ్లి కూడా చేసుకోవాలనుకుందట. ఒకసారి ఎంటెక్ చదువుతున్న రోజుల్లో ప్రభాస్ కి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టిందట. ‘నేను మీతో కలిసి డేట్ కి వెళ్లాలని ఉంది’ అంటూ ప్రభాస్ కి పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టిందట. ఆయన ఏదోలా తన మెసేజ్ చూస్తారేమో అన్న ఆశతో అలా చేసిందట. ఓ ఇంటర్వ్యూలో దివి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆరడుగుల అందగాడు ప్రభాస్. పైగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అలాంటి అందగాడికి పడని అమ్మాయి ఉంటుందా? పెద్ద పెద్ద హీరోయిన్లే ప్రభాస్ కటౌట్ కి పడిపోతున్నారు. ఇక కుర్ర నటి దివి పడకుండా ఎలా ఉంటుంది. కానీ ప్రభాస్ తో డేట్ కెళ్లే ఛాన్స్ రాకపోయినా.. నటించే అవకాశం వస్తుందేమో చూడాలి. ఏమో విధి ఫిక్స్ అయితే దివి కోరిక ఫలిస్తుందేమో ఎవరికి తెలుసు?