ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వారు.. తమ వారసత్వంగా పిల్లలనో, ఇతర బంధువులను పరిశ్రమలోకి తీసుకువస్తారు. అయితే ఈ విధానంపై చాలా విమర్శలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఈ బంధుప్రీతిపై పలువురు సెలబ్రిటీలు ఒపెన్‌గానే కామెంట్స్ చేస్తారు. ఈ జాబితాలో ఫైర్‌బ్రాండ్ కంగన ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలో ఈ నట వారసత్వం కొనసాగుతోంది. అయితే కొందరు నటులు మాత్రం.. తమ పిల్లలను పరిశ్రమకు దూరంగా ఉంచుతారు. కారణాలు ఏవైనా సరే.. పిల్లలను ఇండస్ట్రీలోకి తీసుకురారు. ఈ కోవకు చెందని వ్యక్తి సీనియన్ నటుడు చంద్రమోహన్. ఒకప్పుడు టాప్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన తర్వాత హీరోగా, కమెడియన్‌గా, విలన్‌గానూ ప్రేక్షకులను మెప్పించారు. దాదాపు 900 కు పైగా చిత్రాల్లో నటించారు చంద్రమోహన్. ఇందులో 175 సినిమాల్లో ఆయన హీరోగా నటించడం విశేషంగా చెప్పుకోవాలి.
ఇక చంద్రమోహన్ పక్కన పక్కన హీరోయిన్‌గా చేస్తే వాళ్లు స్టార్లు కావడం పక్కా అనే సెంటిమెంట్ కూడా ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉండేది. అందుకు తగ్గట్టుగానే జయప్రద, జయసుధ, శ్రీదేవి ఇంకా కొంతమంది హీరోయిన్లు స్టార్లుగా ఎదిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే చంద్రమోహన్ తన పాపులారిటీని ఉపయోగించకుని.. తన పిల్లలను కూడా స్టార్లను చేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ చంద్రమోహన్ తన ఫ్యామిలీని సినిమాలకు దూరంగా ఉంచారు. దీనిపై చంద్రమోహన్ గతంలో ఓ సారి స్పందించారు.
‘‘నా ఇద్దరు కుమార్తెలు.. బాగుంటారని, ఒకానొక సమయంలో భానుమతి గారు చెప్పుకొచ్చారు. పిల్లలిద్దరినీ చైల్డ్ ఆర్టిస్టులుగా చేద్దామని కూడా అడిగారు, కానీ నేను వద్దన్నాను. నటుడిగా బిజీగా ఉన్న రోజుల్లో నాకు పిల్లలతో గడిపే సమయం ఉండేది కాదు. అంతేకాదు పిల్లలు ఎప్పుడైనా లోకేషన్ కు వచ్చినా వాళ్లు నన్ను గుర్తు పట్టే వాళ్లు కాదు. నాలా వాళ్ళు ఇండస్ట్రీలో అడుగు పెట్టడం, కష్టపెట్టడం వంటివి వద్దనే ఉద్దేశంతో వాళ్ళను పెంచాను. అందుకు తగ్గట్లుగానే ఇద్దరు కుమార్తెలు కూడా బాగా చదివి గోల్డ్ మెడల్స్ అందుకుని, మంచి ఉద్యోగాలు సాధించారు” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
అయితే చంద్రమోహన్ సొంత తమ్ముడు కూతురు మాత్రం కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సప్తపది’ మూవీలో నటించింది.ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక చంద్రమోహన్ తమ్ముడి కూతురు సబితే.. ఈ సప్తపది చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు అనేక ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ వాటిని సబితా సున్నితంగా తిరస్కరించింది. ఆ తర్వాత వివాహం చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా నివసిస్తోంది. ఈమె ప్రస్తుతం సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తుంది.
క్లాసికల్ డ్యాన్సర్ అయిన సబిత, ఒక ఈవెంట్‌లో డ్యాన్స్ చేస్తుండగా ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కె.విశ్వనాథ్ తన సినిమాలో నటించమని అడిగారట. ఆయన దర్శకుడు కాబట్టి.. పాత్ర కూడా మంచిది కాబట్టి చంద్రమోహన్ చేయమని చెప్పినట్లు తెలుస్తుంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.