50 ఏళ్లకు పైగా తెలుగు సినిమాకు ఎనలేని సేవలు చేసిన ప్రముఖ దర్శకులు, కళాతపస్వి కె. విశ్వనాథ్ గురువారం రాత్రి కన్నుమూశారు. 92 ఏళ్ల విశ్వనాథ్ అనారోగ్యంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శంకరాభరణం, సిరివెన్నెల, స్వాతిముత్యం, స్వయంకృషి లాంటి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసిన విశ్వనాథ్.. తెలుగు సినిమా స్థాయిని పెంచారు. ఆయన తీసిని శంకరాభరణం సినిమా భారతీయ సినీ చరిత్రలోనే ఒక గొప్ప చిత్రంగా నిలిచిపోయింది. ఆయన మరణం.. తెలుగు సినిమా ఇండస్ట్రీకే కాకుండా.. మొత్తం భారతీయ సినిమాకే తీరని లోటు. ఆయన మృతిపై చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. ఆయన మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రముఖులు ట్వీట్లు ఈ కింది విధంగా ఉన్నాయి..
Salute to a master . pic.twitter.com/zs0ElDYVUM
— Kamal Haasan (@ikamalhaasan) February 3, 2023
విశ్వనాథ్‌గారి మరణం తీవ్రవిచారానికి గురిచేసింది. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్‌గారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారు.#KVishwanath pic.twitter.com/XKAq2E68yn
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 2, 2023
తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాధ్ గారిది ఉన్నతమైన స్థానం. శంకరాభరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అపురూపమైన చిత్రాలని అందించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలనుకుంటున్నాను. pic.twitter.com/3Ub8BwZQ88
— Jr NTR (@tarak9999) February 2, 2023
Deeply saddened by the passing of legendary director K. Vishwanath Garu. His urge n passion for storytelling and his commitment to excellence have inspired many filmmakers like me to strive for the best in our own work. We all will miss him dearly… #RIPVishwanathGaru 🙏🏻 pic.twitter.com/PFvbOEuaFd
— Krish Jagarlamudi (@DirKrish) February 3, 2023
Sir You will be Remembered all thru Our
Lives with Your Classics Sir
A greatest film Maker of all times #RIPVishwanathGaruSuch a Huge Loss to INDIAN Cinema 🥹💔
Legend #KVishwanath gaaru Rest In peace sir pic.twitter.com/DKLPaxsuW0
— thaman S (@MusicThaman) February 2, 2023
Janasenani @PawanKalyan garu paid his last tributes to kala tapaswi Viswanath garu.#RIPVishwanathGaru pic.twitter.com/20dYEUXkic
— ✒ త్రివిక్రమ్ ᶠᵃⁿ ✍️ (@Harinani_) February 3, 2023
#RipLegend K Viswanath garu 🙏 pic.twitter.com/a1D9xss3HP
— Mohan Raja (@jayam_mohanraja) February 2, 2023
తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకులు..తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన గొప్ప వ్యక్తి, కె.విశ్వనాథ్ గారు. ఆయన లేని లోటు తీరనిది. #RipLegend 🙏🙏🙏 pic.twitter.com/qFBQ2376ji
— Gopichandh Malineni (@megopichand) February 2, 2023