ఈ లోకంలో మనిషిని నడిపించేది డబ్బు అంటారు... ఆ డబ్బు సంపాదన కోసం రాత్రిపగలు అనే తేడా లేకుండా కష్టపడుతుంటారు. అలాంటిది కోట్ల ఆస్తిని దానం చేయడం సామాన్య విషయం కాదు.
ఈ లోకంలో డబ్బు ఎవరికీ చేదు కాదు.. ప్రతి ఒక్కరికీ ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు డబ్బు గురించిన ఆలోచనలు.. ఎలా సంపాదించాలనే తపన ఉంటుంది. నిరుపేద అయినా.. అపర కుభేరుడైనా కష్టపడేది డబ్బు సంపానకోసమే. డబ్బుంటేనే ఈ లోకంలో గౌరవం.. ఆ డబ్బే మనకు ఆధారం అంటారు. రోడ్డుపై పది రూపాయలు దొరికినా గుట్టుచప్పుడు కాకుండా తీసుకొని జేబులో వేసుకునే కాలం ఇది. ఒక రకంగా చెప్పాలంటే మనిషి జీవితాన్ని శాసించేది డబ్బే. అలాంటిది డబ్బును తృణప్రాయంగా చూస్తూ.. దైవ చింతన కోసం కోట్లు రూపాయలు దానం చేసిన వాళ్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి ఓ కుటుంబ ఒకటి కాదు.. రెండు కాదు వందల కోట్లు విరాళంగా ఇచ్చారు. తమ తదుపరి జీవితం దైవచింతనలో గడపాని సన్యాసం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
గుజరాత్ భుజ్ కి చెందిన ఓ సంపన్న కుటుంబం ఎవరూ ఊహించని విధంగా సంచలన నిర్ణయం తీసుకుంది. వందల కోట్లు కాదనుకొని కుటుంబ మొత్తం దైవ చింతనలో గడిపేందుకు సన్యాసం తీసుకునేందుకు సిద్దమయ్యారు. తమ పెద్దల నుంచి వచ్చిన ఆస్తి.. తాము సంపాదించిన ఆస్తి మొత్తం దానం చేస్తున్నట్లు ప్రకటించారు. తమ కుటుంబంలోని నలుగురు సన్యాసం దీసుకొని దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ఈ దీక్షలో నియనిబంధనల ప్రకారం తమ వద్ద ఉన్న సంపాదన మొత్తం దానం చేస్తున్నట్లు ప్రకటించారు. భుజ్ కి చెందిన పూర్వీ బెన్ మెహతా జైన మతానికి చెందినవారు. వీరి పూర్వికుల నుంచి తరగని ఆస్తులు ఉన్నాయి.. మెహతా కూడా వ్యాపార రంగంలో కోట్లు అర్జించారు. ఎంత సంపాదించినా.. తమకు మనశ్శాంతి దొరకడం లేదని అందుకే తమ వద్ద ఉన్న డబ్బు దానం చేసి దైవ చింతనలో గడిపేయాలని కుటుంబ సభ్యులకు తెలపగా వారు కూడా అంగీకరించినట్లు మెహతా తెలిపారు.
ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా భగవతి దీక్షను స్వీకరించారు. కోట్లకు పడగలెత్తిన కుటుంబంగా గుర్తింపు తెచ్చుకున్న మెహతా కుటుంబం బట్టల బిజినెస్ లో కోట్లు సంపాదించారు. వీరి టర్నోవర్ ఏడాది కోటి రూపాయలకు పై మాటే.. అలాంటిది హఠాత్తుగా సన్యాసం తీసుకునేందుకు నిర్ణయం తీసుకోవడంతో సన్నిహితులు ఆశ్చర్యపోయారు. భార్యాభర్తలతో పాటు కుమారుడు, కూతురు, మేనళ్ళుడు కూడా భగవతి దీక్ష చేపట్టారు. ఈ దీక్ష ఎంతో నియమనిబంధలనతో కఠినంగా ఉంటుందని అంటున్నారు. ఈ దీక్షలో మహావ్రతాలు, బ్రహ్మచర్యంతో పాటు పాదయాత్ర కూడా ఉంటుందని అంటున్నారు.
ఈ సందర్భంగా పూర్వీ బెన్ మెహతా మాట్లాడుతూ ‘ఎన్ని కోట్లు సంపాదించినా జీవితంలో ఏదీ సాధించలేదని ఓ బాధ ఉండేది.. దైవ సన్నిధిలో గడిపితే మనశ్శాంతి లభిస్తుంది.. అందుకే ఈ దీక్ష స్వీకరించాము. ఈ దీక్ష తీసుకున్నవారు కఠిన నిబంధనలు పాటించాలి.. విద్యుత్ వాడకూడదు, డబ్బులు లేకుండా ఉండాలి, జీవితాంతం కూడబెట్టి సొమ్మును విరాళంగా ఇవ్వాలి’ అని అన్నారు. ఏది ఏమైనా ఈ కాలంలో ఉదయం నుంచి రాత్రి వరకు డబ్బు డబ్బు అంటూ పరుగులెత్తే కాలంలో దైవ భక్తి కోసం కోట్లు దానం చేయడం ఎంతో గొప్ప విషయం అంటున్నారు నెటిజన్లు.