ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా హవా నడుస్తోంది. అందులో ముఖ్యంగా టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలకు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోతోంది. బాహుబలీతో దర్శకధీరుడు రాజమౌళి దారి చూపిస్తే.. పుష్పతో సుకుమార్ బాలీవుడ్ కు సాలిడ్ కాంక్రీట్ రోడ్ వేసేశాడు. తాజాగా RRR సినిమాకి బాలీవుడ్ అగ్రహీరోలు, సెలబ్రిటీలు వచ్చి పబ్లిసిటీ కూడా చేశారు. టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ లో బాగా ఆడలంటూ ఆకాంక్షించారు కూడా. కానీ, ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మన పాన్ ఇండియా క్రేజ్ చూసి ఎడుస్తున్న వాళ్లు కూడా లేకపోలేదు. పుష్ప ఫీవర్ తో నిద్రలేని రాత్రులు కలిపిన వాళ్లు కూడా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఇదీ చదవండి: RRR మూవీ రివ్యూ!
ఒకవైపు మన సినిమాలను ఆకాశానికి ఎత్తేస్తూనే అటు బీ టౌన్ సినిమాలను కూడా ఎత్తిన పెట్టుకుంటున్నారు. మనకు దారిస్తున్నట్లు చూపిస్తూనే వాళ్ల సినిమాలను పొగిడేసుకుంటున్నారు. ఇలాగే వదిలేస్తే వారి సినిమాలకే ఎసరు వచ్చేస్తుందని భావిస్తున్నారో ఏమో.. పసలేని బాలీవుడ్ సినిమాలను పనిగట్టుకుని ప్రమోట్ చేసుకుంటున్నారు. విషయంలేని బచ్చన్ పాండో సినిమాని ఆహా ఓహో అంటూ రివ్యూలు, రేటింగ్లు ఇచ్చేశారు. కానీ, కలెక్షన్లు చూస్తేగానీ అర్థం కాలేదు. ఆ సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో. 83 సినిమా విషయంలోనూ అదే జరిగింది.. కానీ బ్లాక్ బస్టర్ స్థాయిని అందుకోలేకపోయింది. తీరా ఓటీటీకి వచ్చాక అక్కడ కూడా కాస్త నెగెటివిటీ మూటగట్టుకుంది.
ఇలా మన సినిమాల ముందు వారేమీ తీసిపోరంటూ చెప్పుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. కాస్త సందు దొరికితే మన సినిమాలను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు. రాధేశ్యామ్ విషయంలో అదే జరిగింది. కాస్త డివైడ్ టాక్ రాగానే మీమర్స్ ను బరిలోకి దించారు. పనిగట్టుకు నెగెటివ్ ప్రచారాలు చేశారు. అయితే అలాంటి వాళ్లు గమనించాల్సిన విషయం ఒకటుంది. ఏ హీరో అయినా, ఏ సినిమా అయినా అందులో మ్యాటర్ ఉంటే ఎవరూ ఎలాంటి పబ్లిసిటీలు చెయ్యక్కర్లా. పుష్ప సినిమాతో బాలీవుడ్ నుంచి అందిన మెసేజ్ అదే. ప్రచారాలు లేకుండానే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
ఇదీ చదవండి: నిద్రలోనే కన్నుమూసిన 25 ఏళ్ల నటుడు
కొందరు దర్శకనిర్మాతలు టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలను బీ టౌన్లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నా కూడా కొందరు మాత్రం తొక్కే ధోరణిని వదిలిపెట్టడం లేదు. ఇటీవల రాజమౌళి RRR సినిమాతో బాలీవుడ్ లో కొన్ని పొరపొచ్చాలు ఉన్నాయని కనిపించింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో క్లాష్, థియేటర్ల విషయంపై జాన్ అబ్రహం స్పందించాడు. తనకు రాజమౌళి సినిమాలంటే ఇష్టమేనని.. కానీ వారి సినిమా నమ్మకముందని చెప్పాడు. వాళ్లు ఎవరి సినిమాకి నంబర్ 2 కాదంటూ కామెంట్ చేశాడు. అంటే పైకి ఎన్ని చెప్పినా.. చేసి చూపించినా కూడా టాలీవుడ్ పాన్ ఇండియా సినిమా అంటే బాలీవుడ్ వాళ్లకు కంటగింపుగానే ఉందనేది తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాల్లో బాలీవుడ్ ను టాలీవుడ్ దాటేసిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.