95వ ఆస్కార్ వేడుకలలో ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. హాలీవుడ్ సెలబ్రిటీలు, ఆడియెన్స్ సైతం నాటు నాటు పాటకు ఫిదా అయిపోయారు. ఆఖరికి అవార్డు కొట్టాక.. ఇండియన్ ప్రేక్షకులు, సౌత్ ఇండియన్ సెలబ్రిటీలు ఎలా ప్రశంసించారో.. ఎంత గొప్పగా ఫీల్ అయ్యారో మనం చూశాం. నాటు నాటుకి ఆస్కార్ వచ్చినందుకు తెలుగు వారిలో ఓ పండుగ వాతావరణం కనిపించింది. కానీ..
ఆర్ఆర్ఆర్.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలిచి చరిత్ర సృష్టించింది. 95వ ఆస్కార్ వేడుకలలో ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. హాలీవుడ్ సెలబ్రిటీలు, ఆడియెన్స్ సైతం నాటు నాటు పాటకు ఫిదా అయిపోయారు. ఆఖరికి అవార్డు కొట్టాక.. ఇండియన్ ప్రేక్షకులు, సౌత్ ఇండియన్ సెలబ్రిటీలు ఎలా ప్రశంసించారో.. ఎంత గొప్పగా ఫీల్ అయ్యారో మనం చూశాం. నాటు నాటుకి ఆస్కార్ వచ్చినందుకు తెలుగు వారిలో ఓ పండుగ వాతావరణం కనిపించింది. కానీ.. ఒకే ఒక ఇండస్ట్రీ నుండి మాత్రం నాటు నాటు ఆస్కార్ గెలిచినందుకు పెద్దగా చలనం కనిపించడం లేదు, పైగా అభినందనలు కూడా రాలేదు.
సరే.. నాటు నాటు సాంగ్ ఆస్కార్ కొట్టడం వాళ్లకు గొప్పగా అనిపించలేదేమో.. లేదా అభినందించే ఉద్దేశం లేక లైట్ తీసుకున్నారేమో! అనుకుందాం. కానీ, ఆ ఇండస్ట్రీలోని స్టార్స్ ఎవరికీ ఆస్కార్ విజయంపై పట్టింపు లేదా? మొన్నటిదాకా బాగానే ఉన్నారుగా ఇప్పుడేమైంది? అని సౌత్ ఇండియన్ ఆడియెన్స్ ప్రశ్నలు కురిపిస్తున్నారు. నాటు నాటు ఆస్కార్ విజయంపై లోకల్ లీడర్స్ నుండి రాష్ట్రపతి, ప్రధానిల వరకు అందరూ సోషల్ మీడియాలో విష్ చేశారు. కానీ.. కేవలం బాలీవుడ్ నుండి మాత్రం పెద్దగా రెస్పాన్స్ కనిపించలేదు. వారు రియాక్ట్ అవుతూ చేసిన ట్వీట్స్, ప్రశంసలు కూడా కనిపించలేదు.
తెలుగు పరిశ్రమ దేశం గర్వించే విజయాన్ని సాధించింది. ఇది చిన్న విషయమా? ఎందుకని బాలీవుడ్ మౌనం వహిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ అందరూ ఏమైపోయారు? సినిమాల ప్రమోషన్స్ లో కనిపించేవారు.. రాజమౌళి పేరు రెగ్యులర్ గా తలచుకునే వారు.. సీనియర్స్ నుండి జూనియర్స్ వరకు ఎవరి నుండి స్పందన లేదు. పఠాన్ కి ముందు టాలీవుడ్ చుట్టూ రౌండ్ వేసిన హీరోలు.. ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో నాటు నాటుకి.. అంటే ముఖ్యంగా తెలుగు సినిమాకి ఆస్కార్ రావడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారా? సోషల్ మీడియాలోనే కదా.. స్పందిస్తే ఏం పోతుంది? అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
తెలుగు సినిమాకి ఆస్కార్ రావడంపై బాలీవుడ్ స్టార్స్ ఈర్ష్య చూపుతున్నారా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడనే కాదు.. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ లో పోటీ పడబోతుందని తెలిసినప్పుడు కూడా.. ఒకరిద్దరు తప్ప పెద్దగా బాలీవుడ్ నుండి ఎవరూ రియాక్ట్ అవ్వలేదు. ఇదిలా ఉండగా.. ట్విట్టర్ లో ఎలాగో స్పందించలేదు. కనీసం పర్సనల్ గా అయినా విష్ చేశారా లేదా అనేది తెలియాల్సి ఉంది. సో.. నాటు నాటు ఆస్కార్ గెలుపుపై బాలీవుడ్ రియాక్ట్ అవ్వకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
‘Naatu Naatu’ from ‘RRR’ wins the Oscar for Best Original Song! #Oscars #Oscars95 pic.twitter.com/tLDCh6zwmn
— The Academy (@TheAcademy) March 13, 2023