టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ యాక్సిడెంట్ కు గురయ్యాడు. శుక్రవారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో పంత్ కారు ప్రమాదానికి గురైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ యాక్సిండెంట్ లో పంత్ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా మంటల్లో దగ్దం అయ్యింది. యాక్సిడెంట్ జరగ్గానే పంత్ కారు అద్దాలను పగలగొట్టుకుని బయటకి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదానికి గురైన వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. […]
బుల్లితెర స్టార్ యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మీ.. ఇటు టీవీ షోలతో పాటు సినిమాలను కూడా బ్యాలెన్సింగ్ గా చేసుకుంటూ వెళ్తోంది. తనకు సంబంధించి ఏ విషయమైనా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేస్తుంటుంది. ఇవన్నీ పక్కన పెడితే.. యాంకర్ రష్మీ జంతు ప్రేమికురాలు అనే సంగతి తెలిసిందే. ఎక్కడ ఏ జంతువుని హింసించినట్లు తెలిసినా, కనిపించినా తనవైపు నుండి రియాక్ట్ అవుతుంటుంది. అలాగే మూగజీవాలను హింసించే వారిపై రష్మీ సోషల్ మీడియాలో […]
క్రికెట్ లో గెలుపోటములు సహజం. ఓడిపోయినంత మాత్రం వారిని తక్కువగా, చులకనగా చూడటం.. మాట్లాడటం చేయకూడదు. అలాగే వారి చరిత్రను తెలుసుకోకుండా నోరు జారకూడదు. అయితే ఈ నీతి పాకిస్థాన్, ఇంగ్లాండ్ ఆటగాళ్లకు లేదని తాజాగా వారు చేసిన ట్వీట్స్ ను బట్టి చూస్తే తెలుస్తుంది. ఓ వైపు అక్తర్ టీమిండియాపై విమర్శలు గుప్పిస్తుంటే తగుదునమ్మా అంటూ వచ్చాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్. సెమీస్ లో ఇంగ్లాండ్ పై టీమిండియా ఓడిపోవడంతో తన నోటికి […]
తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజం.. సవాళ్లకు ఎదురెళ్లి ఢీకొనే నైజం.. మూస ధోరణికి చరమగీతం పాడే ఆలోచనలు ఆయన సొంతం.. ఆయనే ఘట్టమనేని కృష్ణ. కౌబాయ్ గా, గూఢాచారిగా, అల్లూరిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అప్పటి వరకు మూస ధోరణిలో సాగుతున్న తెలుగు సినీ పరిశ్రమను కొత్త పుంతలు తొక్కించి.. ప్రపంచానికి చాటి చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు. గుండె నొప్పితో ఆదివారం అర్ధరాత్రి ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ […]
రికార్డులకు కూడా అతడంటే భయం.. అందుకే అతడికి వంగి సలామ్ కొట్టి.. గులామ్ అవుతాయి. ఇక ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ లను ఒంటి చేత్తో గెలిపించడం అతడికి వెన్నతోపెట్టిన విద్య. అదీ కాక అతడికి బౌలింగ్ చేయాలంటే ఏ బౌలర్ కైనా ఓ వైపు వణుకు పుట్టడం ఖాయం. అందుకే శత్రువులు సైతం అతడి ఆటకు అభిమానులుగా మారిపోతారు. ఇంతగా ఎలివేషన్ ఇస్తుంది ఎవరి గురించో.. ఈ పాటికే మీకు అర్దం అయ్యింది అనుకుంటా! అవును మీరనుకుంటున్న […]
సాధారణంగా కవికి దేన్నైనా వర్ణించడానికి పదాల కొరత ఉండదు. కానీ ఆదివారం కచ్చితంగా పదాల కొరత ఏర్పడి ఉంటుంది.. టీమిండియా విజయాన్ని వర్ణించడానికి. నిజంగా ఏ పదాలూ సరితూగవు.. అంతలా ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కింగ్ కోహ్లీ ధమాకా బ్యాటింగ్ కు తోడు.. అర్షదీప్ అద్భుత బౌలింగ్ తోడైన వేళ.. దాయాది దేశమైన పాక్ ను చివరి ఓవర్లో మట్టికరిపించింది భారత్. చిరస్మరణియ విజయం సాధించిన టీమిండియా పై ప్రపంచ […]
ఏ ఆటగాడైనా అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తే అతడిని జట్టులోని మిగతా ఆటగాళ్లందరు ప్రశంసించడం సహజమే. కానీ తాజాగా భారత బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించడంతో పాక్ క్రికెటర్స్ అతడిపై ట్వీటర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక క్రికెట్ లో భారత్ – పాక్ లకు ప్రత్యేక స్థానం ఉంది. క్రికెట్ లో దాయాది దేశాలు తలపడుతున్నాయి అంటే చాలు.. ప్రపంచం మెుత్తం మన వైపే చూస్తుంది. ఇలాంటి సమయంలో విరాట్ కోహ్లీ […]
ఈ మధ్యకాలంలో థియేటర్లకు జనాలు రావడం లేదని అందుకే సినిమాలకు కలెక్షన్స్ లేవనేది కొందరి వాదన. కాదు.. సినిమాలలో కంటెంట్ ఉండటం లేదు.. కంటెంట్ ఉంటే జనాలు ఎలాగైనా థియేటర్లకు వస్తారనేది మరికొందరి వాదన. ఇక మీరెన్ని చెప్పినా.. థియేటర్లలో టికెట్ రేట్స్ ఎక్కువ అనుకుంటే.. అయినా ఫ్యామిలీతో వెళ్తే థియేటర్ లలో కూల్ డ్రింక్స్, పాప్ కార్న్ ధరలే టికెట్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయనేది ఇంకొందరి వాదన. ఇన్ని వాదనల మధ్య సినిమా పరిశ్రమ ఎటు […]
టాలీవుడ్‌లో ఎప్పటి నుండో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్‌కి బింబిసార రూపంలో సాలిడ్ హిట్ దొరికింది. దీంతో నందమూరి అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. రికార్డు స్థాయి కలెక్షన్స్‌తో ఈ సినిమా దూసుకుపోతోంది. రిలీజైన నాలుగో రోజు కూడా అదే దూకుడు కొనసాగిస్తోంది. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ నటనకి ఫ్యాన్స్‌తో పాటు అటు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఫిదా అయిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోలు కళ్యాణ్ రామ్ […]
తెలుగు ఇండస్ట్రీలో ‘ఫిదా’ చిత్రంతో మంచి పేరు సంపాదించింది సాయిపల్లవి. ఈమె నటించిన ‘విరాట పర్వం’ రిలీజ్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ప్రమోషన్ సందర్భంగా.. కశ్మీర్ పండిట్ల హత్యను, గోవులను అక్రమ రవాణా చేసే వారి హత్యలు ఒకేటనని చెప్పిన మాటలు ఇప్పుడు వివాదానికి దారి తీస్తున్నాయి. అందరూ మానవత్వంతో మెలగాలని, ఎవరైనా బాధితుల పక్షాన ఉండాలంటూ సాయి పల్లవి చేసిన కామెంట్లు ఇప్పుడు దేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపింది. ఈ కారణంతోనే హీరోయిన్ […]