నేచురల్ స్టార్ నాని, సాయిపల్లవి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అందుకొని ప్రేక్షకాదరణ పొందింది. ఇటీవల జనవరి 21 నుండి శ్యామ్ సింగరాయ్ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో కూడా మంచి ఆదరణ దక్కించుకొని నెట్ ఫ్లిక్స్ టాప్ 10 ఎంటర్టైనర్స్ లో చోటు సంపాదించుకుంది.
ఈ సినిమాలో నాని.. అప్ కమింగ్ ఫిల్మ్ డైరెక్టర్ వాసుగా, శ్యామ్ సింగరాయ్ గా రెండు పాత్రల్లో కనిపించాడు. ఇక హీరోయిన్ సాయిపల్లవి ఈ సినిమాలో దేవదాసిగా కనిపించింది. అయితే.. శ్యామ్ సింగరాయ్ లో సాయిపల్లవి అందంగా లేదంటూ తమిళనాడులో ఓ వివాదం సోషల్ మీడియాలో ఊపందుకుంది. తాజాగా ఈ వివాదం పై తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ స్పందించారు.
In a live TV interview today, highlighted on Body-Shaming & its impact on women.
No woman should be discriminated on basis of their appearances/looks, color complexion & other physical characteristics.@PMOIndia @HMOIndia @MoHFW_INDIA @PTTVOnlineNews @pibchennai @ANI pic.twitter.com/rsPMLKKc7Z
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) January 27, 2022
ఆమె ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయిపల్లవి పై బాడీ షేమింగ్ కామెంట్స్ రావడం బాధాకరం. ఒకప్పుడు నేను కూడా నా రూపం విషయంలో ట్రోల్స్ కి గురయ్యాను. కానీ ఎప్పుడు కూడా నేను అధైర్యపడలేదు. ట్రోల్ చేసేవారికి ఏం తెలుసు.. వారి మాటలు ఎదుటివారిని ఎంతలా బాధిస్తాయో. అలాంటి మాటలకు బాధపడ్డాను కానీ నా ప్రతిభ, కృషి కారణంగా నిలబడ్డాను. సమాజంలో స్త్రీలనే బాడీ షేమింగ్ చేస్తుంటారు. మగవారిని 50 ఏళ్లు దాటినా యువకుల్లా చూస్తుంటారని.. ఇలాంటి మాటలను పక్కన పెట్టేసి స్త్రీలు మనోబలంతో ముందుకు సాగాలి’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం గవర్నర్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి బాడీ షేమింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.
Women should maintain their self-confidence always, as the body shamers intention is to demoralize, demotivate & destroy particularly women’s progress.
Don’t give room to such people.Always maintain mental strength & courage by ignoring them appropriately.@PTTVOnlineNews pic.twitter.com/nrnMpiLCS8
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) January 27, 2022