ఆమె తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో తన కంటూ ఓ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. ఆమె నటనకే కాదు.. నాట్యానికి కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారారు.
నేడు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న వారిలో అందం, అభినయంతో పాటు సాంప్రదాయానికి విలువిచ్చే వారు అతికొద్ది మంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో పై ఫొటోలో కనిపిస్తున్న పాప కూడా ఒకరు. ఆ పాప హీరోయిన్గా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తోంది. తెలుగులో అయితే.. పిచ్చ క్రేజ్ తెచ్చుకుంది. సాంప్రదాయ బద్ధంగా ఉండే ఆమె అంటే ఫ్యాన్స్ ప్రాణం ఇచ్చేస్తారు. నటనలోనే కాదు.. నాట్యంలోనూ ఆమె టాప్‌లో ఉంటారు. ఆమె నాట్యం చేస్తే నెమలి పురివిప్పి నాట్యం చేస్తున్నట్లే ఉంటుంది. ఆమెతో ధీటుగా డ్యాన్స్ చేయాలంటే హీరోలకు కష్టమైన పనే. ఈ పాటికే ఆ హీరోయిన్ ఎవరో మీకు అర్థం అయిపోయి ఉంటుంది. ఆ ఫొటోలో తల్లితో పాటు ఉన్న ఆ నటి ఎవరో కాదు.. సాయిపల్లవి.
సాయి పల్లవి డ్యాన్స్‌ర్‌గా చాలా షోలు చేశారు. తెలుగు నాట చాలా ఫేమస్ అయిన ఢీ షోలో కూడా ఆమె పార్టిసిపేట్ చేశారు. డ్యాన్స్‌లో పలు అవార్డులు సైతం గెలుచుకున్నారు. 2005లో తమిళంలో వచ్చిన ‘కస్తూరి మాన్’ అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించారు. 2015 మలయాళంలో వచ్చిన ‘ప్రేమమ్’ సినిమాతో హీరోయిగా మారారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచింది. ‘ఫిదా’ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది.
ఫిదా ఆమె మొదటి సినిమా అయినప్పటికి.. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. తొలి సినిమాతోనే తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. తెలుగులో వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తున్నారు. విరాటపర్వం సినిమా తర్వాత తెలుగులో సినిమా చేయలేదు. ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు.