బాక్సాఫీస్ వద్ద చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ సౌండ్ వినిపిస్తోంది. విక్రమ్, మేజర్ మూవీస్ కాంబినేషన్ హిట్ తర్వాత ఇప్పుడు బింబిసార, సీతారామం సినిమాల కాంబినేషన్ హిట్ సౌండ్ మార్మోగుతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ చేసి అద్భుతమైన లాభాల బాటలో దూసుకుపోతుంది. పటాస్ మూవీ తర్వాత చాలా ఏళ్లకు బింబిసారతో మంచి విజయాన్ని నమోదు చేశాడు.
కమర్షియల్ హంగులు జోడించిన బింబిసార.. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాలలో బింబిసారకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. బింబిసారతో ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ వద్ద ఓ ఊపు క్రియేట్ అయ్యిందని చెప్పవచ్చు. కళ్యాణ్ రామ్ గత సినిమాలకు బింబిసార రెట్టింపు ఓపెనింగ్స్ తెచ్చిందని అంటున్నారు. మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసిన బింబిసార 5వ రోజు కూడా కలెక్షన్స్ నిలకడగా రాబట్టింది.
తెలుగు రాష్ట్రాలలో ‘బింబిసార’ 5 రోజుల కలెక్షన్స్ చూసినట్లయితే..
బింబిసారకు ఏపీ, తెలంగాణలో రూ. 20.43 కోట్ల షేర్, రూ. 31.8 కోట్ల గ్రాస్ రాబట్టిందని ట్రేడ్ వర్గాల సమాచారం. అమెరికాలో రూ 1.32 కోట్లు, రెస్ట్ ఆఫ్ ప్లేసెస్ లో రూ. 1.64 కోట్లు.. ఇక వరల్డ్ వైడ్ బింబిసార రూ. 23.39 కోట్ల షేర్.. రూ. 38.9 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమాను డెబ్యూ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కించారు. మరి బింబిసార మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Bimbisara 5 Days Total WW Collectionshttps://t.co/I5Hqll7vIF
Towards Double Blockbuster! pic.twitter.com/0Vjys58Lau
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) August 10, 2022