ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా తొలిరోజే రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని రాబట్టింది. దీంతో ప్రభాస్ ఏ ఇండియన్ హీరో అందుకోని రికార్డుని తన ఖాతాలో వేసుకున్నారు.
బాహుబలి తర్వాత ప్రభాస్ కి ఆశించిన స్థాయిలో హిట్ పడలేదు. ఈ సినిమా తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. దీంతో ప్రభాస్ సహా ఫ్యాన్స్ అందరూ కూడా ఆదిపురుష్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ నమ్మకానికి తగ్గట్టే రికార్డ్ కలెక్షన్స్ తో ఆదిపురుష్ తొలిరోజు సత్తా చాటింది. గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా కలెక్షన్స్ సునామీ సృష్టించింది. టాక్ కొంచెం నెగిటివ్ గా వచ్చినప్పటికీ తొలిరోజు మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది.
ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలిరోజు ఊహించని కలెక్షన్స్ ని రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 137 కోట్లను రాబట్టింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తొలిరోజు 69 కోట్లు రాబట్టింది. నైజాంలో 18.02 కోట్లు, సీడెడ్ లో 12.05 కోట్లు, అర్బన్ ఏరియాల్లో 8.23 కోట్లు, ఉభయ గోదావరి జిల్లాల్లో 10.01 కోట్లు, గుంటూరులో 5.10 కోట్లు, విజయవాడలో 5.01 కోట్లు, నెల్లూరులో 3.08 కోట్లు కలెక్ట్ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ. 95 కోట్లు వచ్చాయని చెబుతున్నారు. హిందీ భాషలో 35 కోట్లు, తెలుగులో 58.5 కోట్లు, మలయాళంలో రూ. 0.4 కోట్లు, కోలీవుడ్ లో రూ. 0.7 కోట్లు, కన్నడ ఇండస్ట్రీలో రూ. 0.4 కోట్లను రాబట్టిందని చెబుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్స్ రూ. 137 కోట్లు రాబట్టగా, వరల్డ్ వైడ్ షేర్ రూ. 72 కోట్లను రాబట్టిందని చెబుతున్నారు.
యూఎస్ లో 1.35 మిలియన్ డాలర్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టిందని చెబుతున్నారు. బాహుబలి 2 ఓపెనింగ్ డే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ 215 కోట్లు, సాహో 125 కోట్లు, రాధే శ్యామ్ 67 కోట్లు రాబట్టింది. ఆదిపురుష్ వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 135 కోట్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 2023లో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో 100 కోట్ల క్లబ్ లో చేరిన బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా ఆదిపురుష్ నిలిచింది. దీంతో ప్రభాస్ సినిమా విడుదలైన తొలిరోజే 3 సినిమాలతో 3 వంద కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టిన హీరోగా రికార్డు సాధించారు. బాహుబలి, సాహో, ఇప్పుడు ఆదిపురుష్ ఈ మూడు సినిమాలు వంద కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టాయి.
#Adipurush Day-1 Collection AP/TS
👉 Nizam – 18.02Cr
👉 CEEDED – 12.05Cr
👉 UA — 8.23Cr
👉 EG& WG – 10.01Cr
👉 GUNTUR – 5.10Cr
👉 Vijayawada – 5.01Cr
👉 Nellore – 3.08CrTotal Day-1 Collection in AP/TS – 69Cr#BlockbusterAdipurush #AdipurushWithFamily #Prabhas𓃵 pic.twitter.com/FolUFlBFf6
— South Digital Media (@SDM_official1) June 17, 2023
#Adipurush – Day-1 Collection WW#Adipurush Collected Day -1 – 137Cr From World Wide#Prabhas𓃵 #BlockbusterAdipurush pic.twitter.com/Wtk5wyqWt7
— South Digital Media (@SDM_official1) June 16, 2023
#Adipurush Collection USA🇺🇸:
As of 16 june, 8PM CT
Gross Collection = $1.35 Million💥💥💥#Prabhas #AdipurushCollection pic.twitter.com/O5oZX1erjQ
— Prabhas Fans USA🇺🇸 (@VinayDHFprabhas) June 17, 2023