నందమూరి హీరోల్లో కల్యాణ్ రామ్‌కు ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. ట్రెండ్‌కు తగ్గట్లుగా కాకుండా విభిన్నమైన కాన్సెప్ట్‌లతో కూడిన కథలను ఆయన ఎంచుకుంటారు. ఎప్పుడూ సింపుల్‌గా ఉండేందుకు ఇష్టపడే కల్యాణ్ రామ్ భార్య గురించి బయట పెద్దగా ఎవరికీ తెలియదు. ఆమెకు టాలీవుడ్లో తన భర్త కంటే కూడా మరో హీరో అంటే చాలా ఇష్టమట.
నందమూరి వంశం నుంచి చాలా మంది నటులు తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ వారసులుగా వచ్చిన వారిలో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. ఎన్టీఆర్ లెగసీని ఘనంగా ముందుకు తీసుకెళ్లిన వారిలో నటసింహం బాలకృష్ణ ఉన్నారు. ఇప్పటికీ ఆయన తండ్రి చూపిన బాటలోనే నడుస్తూ ప్రేక్షకులకు ఫుల్‌గా వినోదం పంచుతున్నారు. బాలయ్య తర్వాత ఆయన సోదరుడు హరికృష్ణ కూడా తెరంగేట్రం చేశారు. గాంభీర్యంతో కూడిన డైలాగ్ డెలివరీతో హరికృష్ణ అందర్నీ అలరించారు. ‘సీతయ్య’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాల్లో తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు హరికృష్ణ. ఆయన వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు కల్యాణ్ రామ్. ‘బాల గోపాలుడు’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన కల్యాణ్ రామ్.. ‘అభిమన్యు’ సినిమాతో హీరోగా మారారు.
‘అభిమన్యు’ తర్వాత చేసిన ‘అతనొక్కడే’తో సూపర్ హిట్‌ను అందుకున్నారు కల్యాణ్ రామ్. అనంతరం పలు హిట్స్‌ను ఆయన తన ఖాతాలో వేసుకున్నారు. గతేడాది ‘బింబిసార’తో మరో బ్లాక్ బస్టర్ కల్యాణ్ రామ్ అకౌంట్లో పడింది. ప్రస్తుతం ‘డెవిల్’ అనే మూవీలో యాక్ట్ చేస్తున్నారాయన. ఇక, కల్యాణ్ రామ్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆయన భార్య పేరు స్వాతి. వీళ్లది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. వృత్తిపరంగా డాక్టర్ అయిన స్వాతి.. మ్యారేజ్ తర్వాత తన జాబ్‌ను వదిలేశారు. ఆమె గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. టాలీవుడ్ హీరోల్లో భర్త కల్యాణ్ రామ్ కంటే కూడా ఆమెకు కింగ్ అక్కినేని నాగార్జున అంటే ఎక్కువ ఇష్టమట. నాగ్ నటించిన ‘మన్మథుడు’ చిత్రాన్ని ఆమె లెక్కలేనన్ని సార్లు చూశారట. కాలేజీ రోజుల్లో కింగ్ మూవీ విడుదల అవుతుందంటే చాలు.. క్లాసులకు డుమ్మా కొట్టి మరీ ఫ్రెండ్స్‌తో కలసి థియేటర్లలో వాలిపోయేవారట స్వాతి.