తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించే రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఎల్లప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. ఇప్పటివరకు తెలుగులో ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో.. త్వరలోనే OTT వెర్షన్ ప్రారంభం కాబోతుందని అందరికి తెలిసిందే. అయితే.. బిగ్ బాస్ OTT వెర్షన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఓ షాకింగ్ న్యూస్ బుల్లితెర వర్గాల్లో వైరల్ అవుతోంది.
బిగ్ బాస్ తెలుగు ఓటిటి సీజన్ వాయిదా పడినట్లు చక్కర్లు కొడుతున్నాయి. తెలుగులోకి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బిగ్ బాస్ ప్రస్తుతం ఆదరణలో గానీ, టీఆర్పీ రేటింగ్ లో గానీ టాప్ లో ఉండటం విశేషం. బిగ్ బాస్ ఓటిటి వెర్షన్ మొదటగా గతేడాది హిందీలోప్రారంభమై మంచి ఆదరణ దక్కించుకుంది. అది దృష్టిలో పెట్టుకొని తెలుగు బిగ్ బాస్ యాజమాన్యం ఓటిటి వెర్షన్ ప్లాన్ చేసింది. ఈ ఓటిటి షో డిస్నీ హాట్ స్టార్ లో 24 గంటలు ప్రసారం కాబోతుంది.82 రోజులపాటు సాగనున్న ఈ బిగ్ బాస్ ఓటిటి షో ఫిబ్రవరి 20 నుండి మొదలు కానుందని ప్రచారం జరిగింది. ఇప్పటికే ఈ షో కోసం కంటెస్టెంట్స్ ఎంపిక కూడా చివరి దశకు చేరుకుందట. ఈ ఓటిటి వెర్షన్ లో 15 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటారని తెలుస్తుంది. ఇక షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఓటీటీ మొదటి సీజన్ ఫిబ్రవరి 20వ తేదీన కాకుండా 26 నుండి గ్రాండ్ గా స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ సీజన్ ఆదివారం కాకుండా శనివారం ప్రారంభం కాబోతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి బిగ్ బాస్ ఓటిటి సీజన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.