ఓటీటీలోకి ఈరోజే రావాల్సిన అఖిల్ 'ఏజెంట్' వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ కూడా అప్పుడే బయటకొచ్చేసింది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది.
శుక్రవారం వస్తే చాలు థియేటర్లకు వెళ్లి కొత్త సినిమాలు చూసేవాళ్లు కొందరైతే.. ఓటీటీలో కొత్త మూవీస్ ఏం వచ్చాయా, వాటిని ఎప్పుడు చూసేద్దామా అని మరికొందరు వెయిట్ చేస్తుంటారు. వాళ్లకోసమా అన్నట్లు ఈ వీకెండ్ కి దాదాపు 26 సినిమాలు/వెబ్ సిరీసులు రిలీజ్ కి రెడీ అయ్యాయి. వాటిలో అఖిల్ ‘ఏజెంట్’ కూడా ఉంది. దీనికోసం పలువురు ఫ్యాన్స్ వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు సడన్ గా ఓటీటీ సంస్థ రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గింది. స్ట్రీమింగ్ ని వాయిదా వేసింది. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి విషయం?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 28న అఖిల్ ‘ఏజెంట్’ మూవీ థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ కి ముందు ఓ మాదిరి ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత మార్నింగ్ షోకే ఘోరమైన టాక్ తెచ్చుకుంది. అఖిల్ కెరీర్ లో మరో ఫ్లాఫ్ గా నిలిచింది. దీనిపై నిర్మాత అనిల్ సుంకర, హీరో అఖిల్ ఇద్దరూ కూడా లెటర్స్ రిలీజ్ చేశారు. ‘ఏజెంట్’ ఫెయిల్యూర్ విషయమై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఈ సినిమా మే 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది సోనీ లివ్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. మరీ మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుండటంపై మూవీ లవర్స్ హ్యాపీగా ఫీలయ్యారు.
ఇప్పుడు సదరు ఓటీటీ సంస్థ ఏం మనసు మార్చుకుందో ఏమో గానీ ఈ రోజే రిలీజ్ కావాల్సిన ‘ఏజెంట్’ని వాయిదా వేసింది. మరోవారం తర్వాత అంటే మే 26న స్ట్రీమింగ్ చేసే అవకాశముందని మాట్లాడుకుంటున్నారు. ఇలా ఓటీటీ విడుదల విషయంలో డేట్ అనౌన్స్ చేసి, వాయిదా వేయడం చాలా తక్కువసార్లు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అఖిల్ ‘ఏజెంట్’ విషయంలో ఆ కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఏదేమైనా దీనిపై అధికారిక ప్రకటన వస్తే గానీ అసలు విషయం క్లారిటీ రాదు. మరి అఖిల్ మూవీని ఓటీటీలో వాయిదా వేయడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.