ఈ మధ్యకాలంలో అన్ లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటివరకు టీవీ షోగా ప్రసారమైన ఈ బిగ్ బాస్ షో.. త్వరలోనే OTT వేదికపై ప్రారంభం కానుంది. ఇటీవలే 5వ సీజన్ ముగించుకొని 6వ సీజన్ లోకి అడుగుపెడుతోంది బిగ్ బాస్. అయితే.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ ఓటిటి షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అని అంతా వెయిట్ చేస్తున్నారు.
ఈసారి బిగ్ బాస్ ఓటిటి షోకి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ ప్రారంభం డేట్ ఫిక్స్ అయిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బిగ్ బాస్ యాజమాన్యం అయితే ఇంతవరకు డేట్ రివీల్ చేయలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ తెలుగు ఓటిటి షో ఫిబ్రవరి 27న మొదలు కానుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.బిగ్ బాస్ టీమ్ త్వరలోనే దీనికి సంబంధించి ఇవ్వబోతున్నారట. ఇప్పటికే ఓటిటి సీజన్ కోసం కంటెస్టెంట్స్ ఎంపిక కూడా జరుగుతోంది. ఇక బిగ్ బాస్ ఓటిటికి నుండి కొత్తగా ప్రోమో వీడియోస్ కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. మరో విశేషం ఏంటంటే.. బిగ్ బాస్ ఓటీటీలో బజ్ హోస్ట్ కూడా ఉంటారు. అందుకోసం ఇదివరకు బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్లను కూడా ఎంట్రీ ఇవ్వనున్నారట. ప్రస్తుతానికి తనీష్, ధన్‌రాజ్, ముమైత్ ఖాన్, ఆదర్శ్, యాంకర్ శివ, ఆర్‌జే చైతు ఇలా కొందరి పేర్లు వైరల్ అవుతున్నాయి. మరి బిగ్ బాస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.