ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ ఏ విషయమైనా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా స్టార్స్ నుండి నార్మల్ ఆడియెన్స్ వరకూ అందరూ సోషల్ మీడియాలోనే ఎక్కువ యాక్టీవ్ గా ఉంటున్నారు. సినిమాలు, సీరియల్స్ కాకుండా బిగ్ బాస్ షో ద్వారా ఫేమస్ అయినవారు చాలామంది ఉన్నారు. అలా బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీలలో శివజ్యోతి ఒకరు. ఈమె తీన్మార్ సావిత్రిగా అందరికీ సుపరిచితమే. న్యూస్ రీడర్ గా క్రేజ్ తెచ్చుకున్న శివజ్యోతి.. బిగ్ బాస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక తనకు ఫేమ్ తీసుకొచ్చిన న్యూస్ రీడర్ రోల్ నే కంటిన్యూ చేస్తోంది. అప్పుడప్పుడు ఎంటర్టైన్ మెంట్ షోలలో పార్టిసిపేట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. బుల్లితెర ప్రోగ్రామ్స్ లో శివజ్యోతి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఒక్కోసారి తన భర్త గంగూలీని కూడా టీవీ ప్రోగ్రామ్స్ లోకి తీసుకొస్తుంది. మొన్నటివరకు ఇస్మార్ట్ జోడిలో కనిపించిన శివజ్యోతి – గంగూలీ.. రీసెంట్ గా మిస్టర్ అండ్ మిసెస్ షోలో కూడా సందడి చేశారు. ఇవేకాకుండా శివజ్యోతి సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తోంది. ఆ ఛానల్ లో తన షాపింగ్, హోమ్ టూర్.. ఇలా అన్ని వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది.
సోషల్ మీడియాలో ఎలాగో యాక్టీవ్ గా ఉంటుంది. కాబట్టి, శివజ్యోతి తాజాగా ఓ సర్ప్రైజింగ్ పిక్ పోస్ట్ చేసింది. శివజ్యోతి మాట్లాడే భాష పక్కా తెలంగాణ ఊరు యాసలో ఉంటుంది. అదే యాసలో మామిడి తోటలో కూర్చొని మటన్ కూర తింటున్నానని చెప్పింది. అంతేగాక.. మా ఊరు మామిడి తోటలో మటన్ కూర, మక్క గుడాలు, ఈత కల్లు అంటూ నవ్వుతూ కనిపిస్తున్న పిక్ షేర్ చేసింది. అంతే ఆ పిక్ చూసిన ఫ్యాన్స్ ఊరుకుంటారా.. సావిత్రి అక్క ఏమన్న దావత్ చేసుకుంటుందా అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శివజ్యోతి తన ఫ్యామిలీతో ఊర్లో చిల్ అవుతున్నట్లు పిక్ చూస్తే తెలుస్తోంది.