బిగ్‌బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఐస్‌లో నిలబడి ఉండడం వల్ల అతని పాదాలు కమిలిపోయాయి. తాజాగా దానికి సంబంధించిన ఫోటోని ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేస్తూ.. ‘స్వీట్ అండ్ రాడ్ మెమోరీ’ ఫన్నీగా కామెంట్ చేశాడు షణ్ముఖ్. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఇది బిగ్‌బాస్ హౌస్‌లో తగిలిన గాయమా.. లేదా ఇప్పుడు తగిలిన గాయమా అనేది తెలియాల్సి ఉంది. బిగ్‌బాస్-5లో మాత్రం కొన్ని టాస్కులు చాలా కఠినంగా ఉన్నాయి. బిగ్‌బాస్ ఇచ్చిన కొన్ని టాస్కులు కంటెస్టెంట్స్ ని చాలా ఇబ్బంది పెట్టాయి. మరీ ముఖ్యంగా టికెట్ టు ఫినాలే టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ ఇచ్చిన ఐస్ టాస్క్ దారుణమనే చెప్పాలి. దానివల్ల సిరి, శ్రీరామచంద్రల పాదాల చర్మం ఊడిపోయి కాళ్లు ఎరుపెక్కాయి. ఇప్పుడు ఆ కోవలోకి షణ్ముఖ్ జస్వంత్ చేరినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి : షణ్ముఖ్- దీప్తీ సునయన బ్రేకప్ తర్వాత సిరి ఇన్ స్టా స్టోరీ వైరల్!
బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తరువాత షణ్ముఖ్ జీవితం మొత్తం తారుమారైంది. ఎంతో ప్రాణంగా ప్రేమించిన దీప్తి సునయనతో బ్రేకప్ జరిగింది. బిగ్ బాస్ చివరి వరకు షన్నుని సపోర్ట్ చేస్తూనే వచ్చిన దీప్తి.. చివరకు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత షన్నుని దీప్తి ఒక్కసారి కూడా కలవలేదు. పైగా బ్లాక్ చేసేసిందట. ఈ విషయాన్ని షన్ను స్వయంగా లైవ్‌లో చెప్పాడు. అయితే మొత్తానికి ఈ జోడికి మాత్రం బ్రేకప్ జరిగింది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.