తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్-5 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున.. అందరికన్నా ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో.. ప్రేక్షకులకి క్లియర్ గా చూపించారు. ఇక సీజన్ 5 లో 18వ కంటెస్టెంట్‌గా శ్వేత వర్మ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
శ్వేత వర్మ.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకి వచ్చేది క్యాస్టింగ్ కౌచ్ వివాదం. టాలీవుడ్ లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని గట్టిగా వాదించి చెప్పిన నటి శ్వేత వర్మ. డేర్ అండ్ డాషింగ్ కి శ్వేత వర్మ కేరాఫ్ అని చెప్పుకోవచ్చు.
ద రోజ్ విల్లా, ముగ్గురు మొనగాళ్లు, పచ్చీస్, సైకిల్ వంటి చిత్రాల్లో శ్వేత వర్మ నటించింది. అయితే.., ఇవేవి బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించలేదు. దీంతో.., ఇప్పుడు బిగ్ బాస్ ఆఫర్ కి ఓకే చెప్పి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి..ముక్కుసూటితనంతో ముందుకెళ్లే శ్వేత వర్మ..బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా నిలవగలదు అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
(ముఖ్య గమనిక : అతి తక్కువ సమయంలో.. మాకు అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందించడం జరిగింది. త్వరలోనే మరింత సమాచారం అందిస్తాము)