తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్-5 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున అందరికన్నా ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో.. ప్రేక్షకులకి క్లియర్ గా చూపించారు. ఇక సీజన్ 5 లో ఐదవ కంటెస్టెంట్ గా.. యానీ మాస్టర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో.. ఇప్పుడు యానీ మాస్టర్ బయోడేటా గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.
తెలుగు టెలివిజన్ షోలని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి యానీ మాస్టర్ గురించి పరిచయం అవసరం లేదు. స్టార్ కొరియోగ్రాఫర్ గా, టెలివిజన్ షో జడ్జ్ గా ఈమె పాపులర్ అయ్యింది. ఇక యానీ మాస్టర్ వ్యక్తిగత విషయాలకి వస్తే.., చూడటానికి నార్త్ అమ్మాయిలా కనిపించే యానీ మాస్టర్ పక్కా హైదరాబాదీ. ఈమె 1995 లో సికింద్రాబాద్ లో జన్మించింది. ఇక యానీ మాస్టర్ తండ్రి మాత్రమే కాదు.., వారు కుటుంబం అంతా మిలిట్రీ నేపధ్యమే. ఒక్క యానీ మాస్టర్ మాత్రమే డ్యాన్స్ పై పిచ్చితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. లేడీ డ్యాన్సర్ గా ఎదగడానికి చాలానే కష్టాలు పడింది.
కెరీర్ లో సక్సెస్ కాకముందే పెళ్లి అయిపోయినా, భర్త ప్రోత్సాహంతో తన ప్రయత్నాలను కొనసాగించింది. అయితే.., జానీ మాస్టర్ దగ్గర జాయిన్ అవ్వడంతో యానీ మాస్టర్ లైఫ్ టర్న్ అయిపొయింది. డిల్లకు డిల్లకు అనే పాటకు ఈమె అసిస్టెంట్ గా పని చేసింది. ఆ తరువాత గణేశ్ మాస్టర్, శేఖర్ మాస్టర్ వంటి వారి వద్ద అసిస్టెంట్ గా పని చేసి అనుభవాన్ని సాధించింది. సొంతగా మాస్టర్ అయ్యాక జ్యోతిలక్ష్మి టైటిల్ సాంగ్, పైసా వసూల్ టైటిల్ సాంగ్ చేసి.. మంచి గుర్తింపు దక్కించుకుంది. కెరీర్ లో ఎన్నో కష్టాలను అనుభవించి డ్యాన్స్ మాస్టర్ గా నిలదొక్కుకున్న యానీ మాస్టర్ బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా నిలవగలదు అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
(ముఖ్య గమనిక : అతి తక్కువ సమయంలో.. మాకు అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందించడం జరిగింది. )