తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్-5 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున.. అందరికన్నా ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో.. ప్రేక్షకులకి క్లియర్ గా చూపించారు. ఇక సీజన్ 5 లో 14వ కంటెస్టెంట్‌గా సీరియల్ నటుడు విశ్వా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
విశ్వాకి ఇండస్ట్రీలో ఎవరైనా అండగా ఉన్నారు అంటే అది అక్కినేని కుటుంబం అని చెప్పుకోవచ్చు. అక్కినేని అఖిల్ విశ్వాకి క్లాస్ మేట్. ఈ కారణంగానే నాగార్జున నిర్మించిన “యువ” సీరియల్ లో విశ్వాకి అవకాశం లభించింది. ఇక్కడే నుండే నటుడిగా విశ్వ ప్రయాణం మొదలయింది. ఇక నాగచైతన్య ఫస్ట్ మూవీ జోష్ లోనూ విశ్వాకి అవకాశం లభించింది. ఇలా.. అక్కినేని అండతో నిలదొక్కుకున్న విశ్వ.. తరువాత వరుస సీరియల్స్ తో బిజీ అయ్యాడు. ఇదే సమయంలో బాడీ బిల్డర్ గా కూడా తన ప్రత్యేకతని చాటుకున్నాడు.
“వచ్చిన ప్రతీ అవకాశాన్ని నిచ్చెనగా చేసుకుని.., ఒక్కో మెట్టు ఎదగడం మొదలుపెట్టాను. ఉక్కులు కరిగించే.. నిప్పుల సెగను ఊపిరిగా చేసుకుని, కన్నీళ్లను కండలు చిందించే చెమటగా మార్చి, నేను నడిచేదారి కూడా తలవంచి నన్ను ముందుకు నడిపేవరకు, నేను కన్న కల నిజమయ్యే వరకు ప్రయత్నిస్తూనే.. ఉంటాను” అంటూ.. హౌస్ లోకి వెళ్లే ముందు ఎమోషనల్ గా మాట్లాడాడు ఈ నటుడు. మరి.. తన కెరీర్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న విశ్వ.. బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా నిలవగలడు అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.