మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ తెరకెక్కుతున్న మూడో చిత్రం.. SSMB28. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. దాదాపు 12 ఏళ్ళ తర్వాత వీరి కాంబినేషన్ సెట్ అయ్యేసరికి.. అభిమానులలో అంచనాలు పీక్స్ లోకి చేరుకున్నాయి. ఈ సినిమాలో.. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా మూడో హీరోయిన్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు కథనాలు వైరల్ అవుతున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు, అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ తెరకెక్కుతున్న మూడో చిత్రం.. SSMB28. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. దాదాపు 12 ఏళ్ళ తర్వాత వీరి కాంబినేషన్ సెట్ అయ్యేసరికి.. అభిమానులలో అంచనాలు పీక్స్ లోకి చేరుకున్నాయి. అదీగాక ప్రస్తుతం త్రివిక్రమ్, మహేష్ ఇద్దరూ సూపర్ హిట్స్ తో ఫామ్ లో ఉన్నారు. అరవింద సమేత, అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్స్ తో ఓవైపు త్రివిక్రమ్.. మహర్షి, సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట హిట్స్ తో మరోవైపు మహేష్.. మరి వీరి కాంబినేషన్ లో మూవీ అంటే.. ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియెన్స్ లో కూడా అంచనాలు రెట్టింపు అవుతుంటాయి.
ప్రెజెంట్ SSMB28 అనే వర్కింగ్ టైటిల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో.. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే.. మహేష్ తో పూజాకి ఇది రెండో సినిమా. గతంలో మహర్షి చేశారు. కాగా.. శ్రీలీల ఇందులో సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతుంది. జనరల్ గా త్రివిక్రమ్ సినిమాలలో కొన్నాళ్లుగా ఇద్దరు హీరోయిన్స్ కంటిన్యూ అవుతున్నారు. ఈసారి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడని టాక్ నడుస్తోంది. ఇలాంటి తరుణంలో తాజాగా మహేష్ సినిమాలో మూడో హీరోయిన్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు కథనాలు వైరల్ అవుతున్నాయి. అదికూడా బాలీవుడ్ స్టార్ భూమి పడ్నేకర్ అని అంటున్నారు.
ఈ క్రమంలో మహేష్ సినిమాలో భూమి మూడో హీరోయిన్ గా కనిపించనుందని కొందరు అంటుంటే.. కాదు.. భూమిని ఐటమ్ సాంగ్ కోసం తీసుకున్నారట అని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. మూడో హీరోయిన్ గా ఏమోగానీ.. ఐటమ్ సాంగ్ ఉంటే ఉండొచ్చని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే.. త్రివిక్రమ్ లాస్ట్ రెండు సినిమాలలో ఐటమ్ సాంగ్స్ లేవు. కానీ.. ఈసారి మహేష్ కోసం మరింత స్పెషల్ గా.. పక్కాగా బ్లాక్ బస్టర్ ఇవ్వాలని జాగ్రత్త పడుతున్నాడట. అందుకోసమే ఓ స్క్రిప్ట్ లో క్లాస్ టచ్ ఉన్నప్పటికీ.. ఓ కమర్షియల్ సినిమాలో ఉండాల్సినవన్నీ ఉండేలా చూసుకుంటున్నాడని.. ఆ లెక్కన భూమిని ఐటమ్ సాంగ్ కోసం సంప్రదించారని వినికిడి. చూడాలి దీనిపై త్వరలోనే క్లారిటీ రానుందేమో! మరి మహేష్ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటే బాగుంటుందా లేదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.