Sharmili Ahmed: ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి షర్మిలి అహ్మద్.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించారు. ప్రస్తుతం ఆమె వయసు 75 ఏళ్ళు. కాగా నటి షర్మిలి మరణించిన వార్తను యాక్టర్స్ ఈక్విటీ ప్రెసిడెంట్ అహ్సన్ హబీబ్ నసిమ్ ధృవీకరించారు.
వివరాల్లోకి వెళ్తే.. కొన్నిరోజుల క్రితం షర్మిలి అహ్మద్‌కు క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఆమె ఎవర్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 9:30 గంటలకు మరణించినట్లు అహ్సన్ హబీబ్ నసీమ్ తెలిపారు. ఇక షర్మిలి మృతదేహాన్ని ఉత్తరలోని ఆమె ఇంటికి తరలించారు.
పశ్చిమ బెంగాల్, ముర్షిదాబాద్‌లోని బేలూర్ చోక్ గ్రామంలో 1947 మే 8న షర్మిలి అహ్మద్ జన్మించారు. ఆరుగురు తోబుట్టువులలో ఈమే పెద్దది. ఆమె చెల్లెలు వహిదా మోలిక్ జాలీ కూడా ప్రఖ్యాత నటి. ఇక షర్మిలి పుట్టిన కొద్ది నెలలకే, భారతదేశ విభజన సమయంలో ఆమె కుటుంబం రాజ్‌షాహికి వెళ్లడంతో.. షర్మిలీ అహ్మద్ అక్కడ పెరిగారు.
చిన్నతనం నుంచి ఆమెకు నటనపై ఆసక్తి ఉండేది. ఆమె తన నాలుగేళ్ల వయసులో తన తండ్రి దర్శకత్వం వహించిన రంగస్థల నాటకంలో మొదటిసారి నటించింది. షర్మిలి అహ్మద్ కి పాడటం, నటన, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఇంటరెస్ట్ తో పెరిగింది. 60వ దశకం ప్రారంభంలో, ఆమె రాజ్షాహి రేడియోలో అనౌన్సర్‌గా మరియు నాటక కళాకారిణిగా పనిచేసింది.
ఆమె 1968లో జుగ్ను అనే ఉర్దూ చిత్రం ద్వారా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. షర్మిలి అహ్మద్ నటించిన ఉర్దూ చిత్రాలు జుగ్ను, ఉజాలా, పంచీ బౌరా మరియు తికాన. 1968లో సుభాష్ దత్తా దర్శకత్వం వహించిన ‘అబిర్‌భాబ్’ షర్మిలి మొదటి బెంగాలీ చిత్రం. ఇక షర్మిలి నటించిన సినిమాలతో పాటు పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించారు.
షర్మిలి అహ్మద్ నటించిన సినిమాలలో.. బ్రిష్టిర్ పోరే, అమదర్ ఆనందో బారి, అగుంటుక్, పోషక్, అంచోల్, చెనా మనుషేర్ పాంచాలి, ధుప్చయా, ఉపోషోంఘర్, పౌష్ ఫాగునేర్ పాలా, మెహెర్జాన్, ఛెలేటి, అబర్ హవా బోడోల్ సినిమాలు ఆమెకు నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. మరి ప్రఖ్యాత నటి షర్మిలి అహ్మద్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
The actress is indistinguishable from the platform of television in #Bangladesh. She is a living legend who has acted in numerous television dramas and also appeared on big screen in several movies.
Read More: https://t.co/iwjcnpFXbh#SharmiliAhmed pic.twitter.com/TrcJ6Yh2K5
— The Daily Star (@dailystarnews) July 8, 2022