బండ్ల గణేశ్.. ఒక నటుడిగా, నిర్మాతగా తానేంటో నిరూపించుకున్నాడు. బండ్ల గణేశ్ అనే కంటే పవన్ కల్యాణ్ భక్తుడు అంటే ఇంకా ఎక్కువ ఆనందపడతాడు అనమాట. నా దేవుడు పవన్ కల్యాణ్ అని బాహాటంగానే చెప్పుకునే ఈయన గత రెండురోజులుగా పట్టలేని ఆనందంలో ఉన్నాడు. అందుకు కారణం ఏంటంటే.. ఆయన దేవుడుని హీరోగా పెట్టి గబ్బర్ సింగ్ అనే సినిమా తీసి ఇప్పటికి పదేళ్లు పూర్తయ్యింది. ఓ పవర్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికి ఒక దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా బండ్లన్న చాలా హ్యాపీగా ఉన్నాడు. గబ్బర్ సింగ్ సినిమాకి దర్శకత్వం వహించిన హరీశ్ శంకర్ కు మంచి ఖరీదైన వాచ్ ఒకటి గిఫ్ట్ గా కూడా ఇచ్చాడు.
ఇదీ చదవండి: IPL తర్వాత సినిమాల్లోకి ధోని! హీరోయిన్‌గా నయనతార
సినిమా విడుదల జరిగి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత బండ్ల గణేశ్.. డైరెక్టర్ హరీశ్ శంకర్ ను కలిసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఆ సందర్భంగా ఒమేగా కంపెనీకి చెందిన సీ మాస్టర్ ప్రొఫెషనల్ వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. దాని ధర వేలల్లో కాదు.. లక్షల్లో ఉంటుంది. బండ్లన్న హరీశ్ శంకర్ చేతికి పెట్టిన ఆ ఖరీదైన వాచ్ ధర అక్షరాలా రూ.4.35 లక్షలు అనమాట. అవును మరి బండ్లన్న ప్రేమ అంటే అంతే ఉంటుంది. గతంలో ఇద్దరమ్మాయిలతో సినిమా సమయంలో రూ.44 లక్షలు విలువజేసే వజ్రాలు పొదిగిన లైటర్ ఒకటి పూరీ జగన్నాథ్ కి గిఫ్ట్ ఇచ్చిన విషయం గుర్తింది కదా. ఇప్పుడు హరీశ్ శంకర్ కు వాచ్ గిఫ్ట్ ఇచ్చాడనమాట.
🙏🙏🙏🙏🙏🙏 thank you sir https://t.co/SjhswhfaSs
— BANDLA GANESH. (@ganeshbandla) May 11, 2022
ఇంక గబ్బర్ సింగ్ సినిమా విషయానికి వస్తే.. మన అభిమాన హీరోని డైరెక్ట్ చేసే అవకాశం మనకి వస్తే ఏ రేంజ్ లో చూపిస్తామో.. ఒక అభిమానిగా హరీశ్ శంకర్ పవన్ కల్యాణ్ ను అదే స్థాయిలో చూపించాడు. పవన్ కల్యాణ్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ ను మరింత పెంచిన చిత్రం అది. నిర్మాత, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఆ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ లో ఎంతో మంది పవన్ ఫ్యాన్సే ఉన్నారు. అలా రూ.30 కోట్లు పెట్టి తెరకెక్కించిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసి.. ఏకంగా రూ.150 కోట్లు కలెక్ట్ చేసింది. వరుస ఫ్లాపుల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద పవన్ స్టామినా చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. మరి హరీశ్ శంకర్ కు బండ్ల గణేశ్ కాస్ట్లీ వాచ్ గిఫ్ట్ గా ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#DecadeForGabbarSingh #GabbarSingh inko movie set chey anna 🔥❤️🙏 #PawanKalyan anna tho. pic.twitter.com/koLgXXVc0z
— ℕ𝔸ℕ𝔻𝔸 (@kishorenanda927) May 11, 2022