హిట్ సినిమాల దర్శకుడు శరత్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఏప్రిల్ 1, శుక్రవారం ఉదయం కన్నుమూశారు. శరత్ మృతి పట్ల హీరో నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆయన గొప్ప దర్శకుడు మాత్రమే కాక మానవత్వం ఉన్న వ్యక్తి కూడా అని తెలిపారు. ఈ మేరకు బాలకృష్ణ ప్రకటన విడుదల చేశారు.
ఇది కూడా చదవండి: బాలకృష్ణపై హీరోయిన్ పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘‘శరత్ నాకు మంచి ఆప్తుడు. పరిశ్రమలో మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనతో నేను వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్, వంశోద్ధారకుడు సినిమాలు చేశాను. ఈ రోజు ఆయన మరణవార్త నన్ను బాధించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకూంటూ.. వారి కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అంటూ బాలకృష్ణ ప్రకటన విడుదల చేశారు.
ఇది కూడా చదవండి: బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! రాజమౌళి దర్శకత్వంలో బాలకృష్ణ!
1986లో వచ్చిన ‘చాదస్తపు మొగుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు దర్శకుడు శరత్. ఈ సినిమాలో సుమన్, భానుప్రియ లీడ్ రోల్స్ చేశారు. బాలకృష్ణ, సుమన్‌లతో ఎక్కువ సినిమాలు చేశారాయన. వీరి కాంబినేషన్‌లో వచ్చిన చాలా సినిమాలు బ్లాక్ బాస్టర్ అయ్యాయి. బాలకృష్ణతో వంశానికొక్కడు, వంశోద్ధారకుడు, పెద్దన్నయ్య, సుల్తాన్ సినిమాలు చేశారు. సుమన్‌తో ‘చాదస్తపు మొగుడు’, పెద్దింటి అల్లుడు, బావ-బావమరిది, చిన్నల్లుడు సినిమాలు చేశారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.