టాలీవుడ్ మాస్ సినిమాలు తీసే దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. కెరీర్ ప్రారంభం నుండి మాస్ క్లాస్ కంటెంట్ ఎంచుకున్నా, మాస్ అంశాలు జోడించి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ముఖ్యంగా నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో తీసిన మూడు సినిమాలు.. సింహా, లెజెండ్, అఖండ ఒకదాన్ని మించి మరోటి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. అయితే.. ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి.. ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హీరో రామ్ భారీ ఆశలే పెట్టుకున్నాడు.
ఎందుకంటే.. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ నటించిన రెండు సినిమాలు రెడ్, ది వారియర్ ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఇక ఎప్పటినుండో మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్న రామ్.. పక్కా మాస్ డైరెక్టర్ తో వర్క్ చేస్తేనే తనకు వర్కౌట్ అవుతుందని భావించి ఈ సినిమా ప్లాన్ చేసుకున్నాడు. అదీగాక రామ్ తో గత చిత్రం ‘ది వారియర్’ నిర్మించిన శ్రీనివాస చిట్టూరినే.. ఇప్పుడీ పాన్ ఇండియా మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో హీరోయిన్ గా ట్రెండీ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. ఇదిలా ఉండగా.. ఎంచుకున్న సబ్జెక్టుకి మరింత మాసీనెస్ యాడ్ అయ్యేందుకు బోయపాటి మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడని టాక్.
ఈ పాన్ ఇండియా మాస్ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ ని డిజైన్ చేసే ఆలోచనలో ఉన్నాడట బోయపాటి. రామ్ హీరో అయినప్పటికీ, సినిమాలో మరో పవర్ ఫుల్ రోల్ ని ఇంట్రడ్యూస్ చేయాలని.. అదికూడా నటసింహం బాలకృష్ణ అయితేనే బాగుంటుందని భావిస్తున్నాడట. ప్రస్తుతం బోయపాటి సినిమాలో మరోసారి బాలయ్య అనే న్యూస్.. అటు సోషల్ మీడియాలో, ఇటు సినీ వర్గాలలో తెగవైరల్ అవుతోంది. మరి బోయపాటి కాంబినేషన్ లో బాలయ్య అనేసరికి నందమూరి ఫ్యాన్స్ లో ఊపు మామూలుగా కనిపించడం లేదు. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా బయటికి రాలేదు. మరోవైపు బాలయ్య – గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి అనే మూవీ చేస్తున్న విషయం విదితమే.